అభిమానుల అభిమానానికి హద్దులే లేవు.. అంటున్న బాలయ్య బాబు..!

ఎవరిని అయినాగానీ మనం ఒకసారి అభిమానించడం మొదలు పేడితే చచ్చే దాక వాళ్ళను అభిమానిస్తూనే ఉంటాము.మరి ముఖ్యంగా సినిమా హీరోలను అయితే నెత్తిన పెట్టుకుని మరి అభిమానిస్తూ ఉంటాము.

 Tirupati Balakrishna Fan Akhanda Hotel Details, Bala Krishna Fans, Food, Viral-TeluguStop.com

వాళ్ళ కోసం ప్రాణాలు తెగించడానికి కూడా అభిమానులు వెనకాడరు.అయితే అభిమానులు అందరికీ ఉంటారు కానీ బాలయ్య బాబుకు ఉన్న అభిమానుల మాత్రం కాస్త ప్రత్యేకం అనే చెప్పాలి.

ఎందుకంటే నందమూరి బాలకృష్ణ రీల్ లైఫ్‌ లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా ఎంతోమందికి ఆదర్శంగా, అండగా నిలిచారు.అలాగే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన అభిమానులు కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.

ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో బాలయ్య ఫ్యాన్స్ అయన మీద ఉన్న అభిమానాన్ని చాలా రకాలుగా చూపించారు.అయితే తాజాగా ఆయన నటించిన ‘అఖండ’ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అంతులేదు.

థియేటర్స్ లో మాత్రమే కాకుండా డిజిటల్ స్ట్రీమింగ్‌ లోనూ అఖండ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి.ఈ క్రమంలోనే ఒక అభిమాని తనకు బాలకృష్ణ మీద ఉన్న అభిమానాన్ని ఇలా చూపించాడు.

Telugu Akhanda Hotel, Balakrishna Fan, Tirupati, Tirupatibalayya, Latest-Latest

బాలయ్య బాబు నటించిన ‘అఖండ’ సినిమా పేరుని ఓ అభిమాని తన హోటల్‌కి పెట్టుకున్నాడు.వివరాల్లోకి వెళితే.తిరుపతిలో బాలయ్య వీరాభిమాని ఒకరు ‘అఖండ’ పేరుని తన హోటల్‌కి పెట్టారు.దీనికి సంబంధించిన పిక్ ట్విట్టర్‌ లో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు.ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.‘బాలయ్య మీద అభిమానం అంటే ఇది ‘అంటూ పలువురు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.ఈ ఫోటో చూసి బాలయ్య బాబు అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube