పాము పగబడితే ఎలా ఉంటుందో మన అందరికి తెలిసే ఉంటుంది.పగపట్టిన మనిషిని కాటేసేవరకు దాని పగ తీరదు.
చాలా సినిమాల్లో మనం పగబట్టిన పాములను చూసే ఉంటాము.అలాగే ఈగలు కూడా పగబడతాయి అని దర్శకుడు రాజమౌళి ఈగ సినిమాలో చూపించడం జరిగింది.
అయితే మీరు ఎప్పుడన్నా కాకి మనుషులు మీద పగబట్టడం గురించి మీరు విన్నారా.కాకి మనుషులపై పగ పట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.? కానీ ఇది నిజంగానే జరిగిన సంఘటన.ఒక కాకి ఏడుగురును టార్గెట్ చేసుకుని వారిపై మాత్రమే దాడి చేస్తుంది.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఏడుగురు ఎంతమందిలో ఉన్నాగాని వారిని గుర్తుపట్టి మరి వారిపై పగ తీర్చుకుంటుంది.
స్వయంగా వారే తమపై కాకి పగబట్టిందని అంటున్నారు.
ఆ ఏడుగురులో ఎవరన్నా కానీ ఇంటి నుంచి బయటకు వస్తే చాలు ఆ కాకి మాటు వేసి మరి వారిని తన ముక్కుతో, కాళ్లతో పొడవడం, రక్కడం లాంటివి చేస్తుందని కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం ప్రజలు చెబుతున్నారు.అసలు వివరాల్లోకి వెళితే.
ఈ విచిత్రమైన ఘటన చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామంలో చోటు చేసుకుంది.అక్కడి ప్రజలు కూడా అసలు పాము పగ గురించి విన్నంగాని ఇలా కాకి పగ గురించి ఎప్పుడు వినలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కొన్ని రోజులుగా ఆ గ్రామంలో ఓ కాకి సంచరిస్తోంది.అది అక్కడ ఉన్న అందరిపై కాకుండా ఓ ఏడుగురిపైనే దాడి చేస్తూ వస్తుంది.వారు గుంపులో ఉన్నా సరే ఎగిరొచ్చి వారిపైనే పగ తీర్చుకుంటుంది.మొదట ఆ గ్రామంలోనే పరుశురామప్ప అనే వ్యక్తిని గోళ్లతో రక్కడం జరిగింది.అలా మరో ఆరుగురిపై ఇలా పగబట్టి దాడిచేస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.కాగా ఆ గ్రామం నుంచి కాకిని తరిమికొట్టే ప్రయత్నాలు ఎన్ని చేసినాగాని ఫలించలేదట.
ఆ కాకి మాత్రం అక్కడే తిష్ట వేసుకుని ఉందని అక్కడి స్థానికులు అంటున్నారు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయం తెలిసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.ఆ ఆరుగురు కాకి ఎమన్నా హాని తలపెట్టరేమో అని ఒకరు అంటే, దానికి గత జన్మ గుర్తు వచ్చి ఉంటుందని మరొకరు అంటున్నారు.