అదొక పక్షుల బంగ్లా.పక్షుల బస మరియు ఆహారం కోసం అన్నిఏర్పాట్లు ఉన్నాయి.ఎండా కాసినా, వర్షం వచ్చినా.ఇక్కడ పక్షులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు.అయితే అది ఎక్కడ ఉందో తెలుసుకుందాం.గుజరాత్‌లోని నవీ సంక్లి గ్రామానికి చెందిన 75 ఏళ్ల భగవాన్జీ భాయ్‌కి పక్షులంటే చాలా ఇష్టం.పక్షులకు ఆహారం పెట్టినప్పుడు, ధాన్యం తిని పక్షులు ఎగిరిపోతుంటే, వానలో ఎలా బతుకు తాయోనని ఆందోళన చెందాడు.140 అడుగుల పొడవు మరియు 40 అడుగుల ఎత్తులో ఒక బర్డ్ హౌస్‌ను నిర్మించాడు.ఇందుకు దాదాపు 2,500 చిన్న, పెద్ద కుండలను ఉపయోగించాడు.అతను నిర్మించిన ఈ అందమైన పక్షుల ఇల్లు అతని గ్రామానికి గుర్తింపుగా మారింది.
దీన్ని సిద్ధం చేసేందుకు ఏడాది సమయం పట్టగా, 20 లక్షల రూపాయలు వెచ్చించాడు.భగవాన్ జీ భాయ్ తన 100 ఎకరాల పొలాలను చూసుకుంటాడు.
ఆగ్రో కంపెనీ నడుపుతున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.ఈ పక్షి గృహంలో పావురాలు మరియు చిలుకలతో సహా అనేక రకాల పక్షులు నివసిస్తాయి.
ఈ బర్డ్ హౌస్ శివలింగ ఆకారంలో ఉంటుంది.గతంలో భగవాన్జీ భాయ్ గ్రామంలో శివాలయాన్ని కూడా నిర్మించాడు.
భగవాన్జీ భాయి నిర్మించిన పక్షుల గృహాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.