సికింద్రాబాద్ క్లబ్ లో ఘోర ప్రమాదం జరిగింది.ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది.
అగ్నికీలలు ఎగిసిపడ్డాయి దీంతో క్లబ్ అంతటా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.