నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ షో 9వ ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది.
పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మి ఈ ఎపిసోడ్ కు గెస్టులుగా హాజరయ్యారు.ఈ నెల 14వ తేదీన ఆహా ఓటీటీలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
సంక్రాంతి కానుకగా ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ లో బాలయ్య పంచెకెట్టులో దర్శనమిచ్చారు.
మాటల గన్.మన జగన్ అంటూ బాలయ్య పూరీ జగన్నాథ్ ను షోలోకి ఆహ్వానించారు.బాలయ్య పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో పైసా వసూల్ అనే సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా గురించి బాలయ్య షోలో మాట్లాడుతూ పైసా వసూల్ మూవీలో అప్పటికీ ఇప్పటికీ మరిచిపోలేని తేడా సింగ్ పాత్రలో నటించానని చెప్పుకొచ్చారు.పైసా వసూల్ సినిమాలో నేను ఎంత ఎదవనో నాకే తెలీదు అనే డైలాగ్ చెబుతానని అదే డైలాగ్ ను వేరేవాళ్లు చెబితే మాత్రం కొడతానని బాలయ్య అన్నారు.
పూరీ జగన్నాథ్ పైసా వసూల్ సినిమాలో ఏ మూహూర్తాన మామా ఏక్ పెగ్ లా అనే డైలాగ్ పెట్టాడో తెలీదు కానీ ఆ డైలాగ్ వల్ల కడుపు తరుక్కుపోయిందని బాలయ్య కామెంట్స్ చేశారు.
ఫస్ట్ టైమ్ కలిసిన సమయంలో ఛార్మి అల్లరిగా ఉండేదని ఇప్పుడు పిడుగులా ఉందని బాలయ్య చెప్పుకొచ్చారు.ఆ తర్వాత పూరీ జగన్నాథ్ లయన్ అని ఛార్మి టైగర్ అని ఇద్దరినీ కలిపితే లైగర్ అని బాలయ్య కామెంట్లు చేశారు.
ఆ తర్వాత విజయ దేవరకొండ షోలోకి ఎంట్రీ ఇవ్వగా సమరసింహారెడ్డి వెల్ కమ్స్ అర్జున్ రెడ్డి అని బాలయ్య అన్నారు.విజయ్ దేవరకొండ రౌడీ అయితే తాను రౌడీ ఇన్ స్పెక్టర్ అని బాలయ్య కామెంట్లు చేశారు.ఛార్మి కొబ్బరి బోండాం తాగుతూ బ్యాంకాక్ లో ఇందులో వోడ్కా కలుపుతారని చెప్పగా అన్నీ చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చి కూర్చున్నామని బాలయ్య చెప్పుకొచ్చారు.