ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి జోరు మీద ఉన్న మ్యూజిక్ డైరక్టర్ ఎవరంటే అది ఎస్.థమన్ అని చెప్పాలి.
వరుస క్రేజీ ప్రాజెక్టులతో సత్తా చాటుతున్న థమన్ లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు సైన్ చేశాడు.జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన డైరక్టర్ అనుదీప్ కెవి డైరక్షన్ లో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ లో నారాయణ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు.
శివ కార్తికేయన్ తెలుగులో స్ట్రైట్ గా చేస్తున్న తొలి సినిమా ఇదే.ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళంలో కూడా బైలింగ్వల్ గా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట.సినిమా ఈమధ్యనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేయగా మ్యూజిక్ డైరక్టర్ గా థమన్ తన వర్క్ స్టార్ట్ చేసినట్టు చెప్పుకొచ్చాడు.
అంతేకాదు సినిమా యూనిట్ ని కలిసిన థమన్ చాలా రోజుల తర్వాత ఎక్కువసేపు లాస్ట్ నైట్ నవ్వానని సోషల్ మీడియాలో పెట్టారు.సో జాతిరత్నాలు డైరక్టర్ ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.