ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ఖర్చుతో ఒక సినిమా తియ్యొచ్చు తెలుసా?

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను ఎస్ .

 Rrr, Ntr , Ram Charan, Rajamouli, Alia Bhatt-TeluguStop.com

ఎస్ .రాజమౌళి దాదాపుగా నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమాను వెండితెరపై చూడడానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ లకు, పోస్టర్ లకు, పాటలకి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఇక చెర్రీ అభిమానులు, తారక్ అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న  ,14 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ గా థియేటర్లలో  విడుదల కానుంది.

ఇక విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.ఈ ప్రమోషన్స్ లో భాగంగా దర్శక నిర్మాతలు, హీరోలు క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ప్రమోషన్స్  చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

కొన్ని ప్రదేశాలలో ప్రమోషన్స్ చేస్తూ అలసత్వం ప్రదర్శించకుండా సినిమాలను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు.ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ మరొక సారి విజృంభిస్తుండడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే తెరచాలి అంటూ ఆంక్షలు విధించారు.

Telugu Rajamouli, Ram Charan-Movie

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా మరొకసారి వాయిదా పడుతుంది అంటూ వార్తలు వినిపించినప్పటికీ దర్శకుడు రాజమౌళి అనుకున్న సమయానికి చెప్పిన సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.ఇదిలా ఉంటే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది.ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేరే రాష్ట్రాలకు వెళ్లడానికి ప్రత్యేకంగా విమానం బుక్ చేసుకొని వెళ్తున్నట్లు సమాచారం.

అదే విధంగా అక్కడ జరిగే ఈవెంట్స్ కోసం కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసే ఆ నలభై కోట్ల రూపాయలతో ఒక సినిమాను కూడా తీయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube