మిస్టర్ అండ్ మిస్ సినిమాతో రొమాంటిక్ హిట్ ఫిల్మ్ రూపొందించిన దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా మహానటులు.ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనిల్ బొడ్డిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మాతలు.
మహానటులు పోస్టర్ లాంఛ్, క్యారెక్టర్ రివీల్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, బిగ్ బాస్ విజేత సన్నీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.అశోక్ నేను, మహేష్ కత్తి, సుధీర్ వర్మ రెగ్యులర్ గా కలిసేవాళ్లం.
అశోక్ ఏ సినిమా చేసినా నేను, మహేష్ కత్తి లేకుండా చేసేవాడు కాదు.మహేష్ కత్తి ఇవాళ మన మధ్య లేడు.
కొత్త వాళ్లను ఎంకరేజ్ చేసేవాడు కత్తి మహేష్.అశోక్ సినిమా పిచ్చోడు.
ఇతనికి బెంగళూరులో మంచి ఉద్యోగం ఉండేది.ఆ ఉద్యోగం మానేసి వచ్చి సినిమాలు చేస్తున్నాడు.
చాలా రోజులు నా చుట్టూ తిరిగాడు.నేను ఉద్యోగం చేసుకోమని తిట్టేవాడిని.
ఓ స్త్రీ రేపు రా అనే షార్ట్ ఫిలిం చేసి మళ్లీ నా దగ్గరకు వచ్చాడు.అశోక్ చేసిన ఓ స్త్రీ రేపు రా అనే సినిమా హిందీలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఆయన ఇన్స్పిరేషన్ తో చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యింది.అశోక్ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు.
కానీ ఆయన ఎదుగుతాడని ఆశిస్తున్నా.ప్రొడ్యూసర్ ఆట ఆసోసియేషన్ యాక్టివ్ గా ఉంటారు.
మా అశోక్ తో సినిమా చేసినందుకు ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్ చెబుతున్నా.అశోక్ పెద్ద దర్శకుడు కావాలన్నది నా కోరిక.
ఈ ఏడాది అది జరుగుతుందని కోరుకుంటున్నా అన్నారు.
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ మాట్లాడుతూ.
బిగ్ బాస్ లో ఈ మధ్య మహానటులను చూశా.నా ఫ్రెండ్ మ్యాడీ ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది.
భరద్వాజ గారు, అనూప్ గారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది.మహానటులు కంప్లీట్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది.
మంచి ట్విస్టులు ఉన్నాయట.మూవీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
నేనూ నటుడినే, అశోక్ గారు మమ్మల్ని కూడా చూడాలని కోరుకుంటున్నా అన్నారు.
హీరోయిన్ గోల్డీ నిస్సీ మాట్లాడుతూ.
నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు అశోక్ గారికి థ్యాంక్స్.నాలాంటి న్యూ టాలెంట్ కు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది.
మహానటులు మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా తప్పక చూడండి, మంచి సినిమా, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా అన్నారు.
దర్శకుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.
టైటిల్ పెట్టినట్లు ఈ సినిమాలో అంతా మహానటులే.జాతిరత్నాలు జానర్ లో సినిమా ఉంటుంది.
నేను ఇప్పటిదాకా కామెడీ జానర్ టచ్ చేయలేదు.సినిమా చేస్తున్నప్పుడు నేనూ ఎంజాయ్ చేశాను.
మన చుట్టూ ఉండే ఓ నాలుగు క్యారెక్టర్స్ కథలో ఉంటారు.ఈ నలుగురు టీమ్ అప్ అయ్యి మహానటులు అనే యూట్యూబ్ ఛానెల్ ను ఎలా డెవలప్ చేశారు అనేది కథ.మీరు ఈ సినిమా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెప్పగలను.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ మాట్లాడుతూ.
నేను నటుడిని అయితే ఈ సినిమా దర్శకుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనే బాధ్యత అప్పగించారు.నిర్మాతలు ఈ సినిమాకు బాగా సపోర్ట్ చేశారు.
క్వాలిటీలో రాజీ పడకుండా నిర్మించారు.దర్శకుడు ఎలాంటి కథను చెప్పాలనుకున్నాడో అది అనుకున్నట్లే తెరపైకి వచ్చింది అన్నారు.
నిర్మాత అనిల్ బొడ్డిరెడ్డి మాట్లాడుతూ.ఏబీఆర్ ప్రొడక్షన్స్ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని ప్రారంభించాం.ప్రతిభ గల కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం, ఇవ్వబోతున్నాం.ఏబీఆర్ టీవీ ప్రారంభించాం.ఇందులో జానపదాలు, బుర్రకథలు ఇలాంటి మన ప్రాచీన కళారూపాలపై డాక్యుమెంటరీలు చేస్తున్నాం.కళాకారులు ఏబీఆర్ టీవీ మన ప్లాట్ ఫామ్ అనుకోవాలి అన్నారు.
నిర్మాత డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి మాట్లాడుతూ.మా సినిమా ప్రచార కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు థ్యాంక్స్.
నాకు సినిమా ఇండస్ట్రీతో పరిచయం లేదు.నా మిత్రుడు అనిల్ బొద్దిరెడ్డి గారు గతంలో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు.
మిస్టర్ అండ్ మిస్ సినిమా చూసి అశోక్ తో కొత్త సినిమా ప్లాన్ చేస్తుంటే నేనూ జాయిన్ అయితా అని చెప్పాను.అలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను.
ఈ మధ్యే మహానటులు సినిమా చూశాను.చాలా బాగా వచ్చింది.
ఇక రెగ్యులర్ గా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాము.త్వరలో ఎమ్మెల్యే సీతక్క బయోపిక్ చేయబోతున్నాం అన్నారు.
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.మహానటులు టీజర్ చూశాను చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంది.సినిమా బాగా నవ్విస్తుందని ఆశిస్తున్నాను.సినిమా హిట్ కావాలని, ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు మార్కస్ ఎం మాట్లాడుతూ.ఈ సినిమాలో నాలుగు సాంగ్స్ ఉంటాయి.
అన్నీ సందర్భానుసారం వచ్చేవే.మంచి ఆల్బమ్ అవుతుంది.
నాకీ అవకాశం ఇచ్చిన దర్శకుడు అశోక్ గారికి థ్యాంక్స్ అన్నారు.
వీజే మ్యాడీ మాట్లాడుతూ…మా డైరెక్టర్ తో గతంలో మిస్టర్ అండ్ మిస్ సినిమా చేశాను.
ఈ సినిమాలో నీకు రోల్ ఉంది అని చెప్పారు.వెంటనే షూటింగ్ కు వెళ్లిపోయాను.
మహానటులు సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం – కథ, మాటలు – పి సుధీర్ వర్మ, సినిమాటోగ్రఫీ – సిద్ధం నరేష్, మ్యూజిక్ మార్కస్ ఎం, ఎడిటింగ్ – కార్తీస్ కట్స్, ఆర్ట్ – హేమంత్ కుమార్ జి.కాస్ట్యూమ్స్ – తనూజ మాలపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – షానీ సాల్మన్, సాహిత్యం – ఫణి కృష్ణ సంకెపల్లి, పవన్ రాచపల్లి, నిర్మాతలు – అనిల్ బొడ్డిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి, పీఆర్వో – జీఎస్కే మీడియా, దర్శకత్వం – అశోక్ రెడ్డి
.