శీతాకాలంలో చర్మ, జుట్టు సంరక్షణకు బెస్ట్ అప్షన్ అరటి పండు.. ఎందుకంటే..?!

ప్రతి రోజు ఒక అరటిపండు తింటే ఎటువంటి రోగాలు అయినాసరే మన దరికి చేరవు అని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తూ ఉంటారు కదా.ఎందుకంటే అరటిపండు తినడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

 Banana Is The Best Option For Skin And Hair Care In Winter Because, Health Car-TeluguStop.com

అలాగే అరటి పండులో పొటాషియం, విటమిన్ సి, బి6 వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.అయితే అరటిపండు వలన ఆరోగ్యంతో పాటు అందం కూడా మీ సొంతం చేసుకోవచ్చు అంటున్నారు బ్యూటీషియన్లు.

మరి ముఖ్యంగా శీతాకాలంలో చర్మ సంరక్షణకు అరటి పండు ఎంతగానో సహాయపడుతుందట.అరటిపండులో ఉండే పొటాషియం వలన చర్మం పొడిబారదు.

అలాగే అరటిపండు మీ పొడి జుట్టుకు పోషణ కూడా ఇస్తుంది.

చర్మ సంరక్షణ కోసం వివిధ రకాల ఫేస్ క్రీమ్స్ వాడడం కంటే బనానా ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అందుకే వారానికి మూడు సార్లు అయినా బనానా ఫేస్ ప్యాక్ ను వేసుకోండి.

అలాగే జుట్టుకు రంగు వేయడం వలన కలిగే దుష్ప్రభవాలకు కూడా ఈ బనానా ప్యాక్ చెక్ పెడుతుంది.బనానాను హెయిర్ ప్యాక్‌ గాను ఉపయోగించుకోండి.

మరి బనానా ఫేస్ ఫ్యాక్స్ ఎలా వేయాలో చూద్దామా.

ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించాలంటే బనానా ఫేస్ ప్యాక్ బెస్ట్ అని చెప్పవచ్చు.

ఒక పండిన అరటి పండును తీసుకుని దానిలో పెరుగు, ఒక టీస్పూన్ గ్లిజరిన్ లేదా తేనె, బాదం నూనె వేసి పేస్ట్ చేసి చర్మానికి పూయండి.ఈ మిశ్రమం చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

అలాగే ఇదే ప్యాక్ ను మీ జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు ఆరనివ్వండి.ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి

Telugu Banana, Face Pack, Care, Tips, Healthy Foods-Latest News - Telugu

అలాగే అరటిపండు గుజ్జును ఇతర పండ్లతో కలిపి కూడా ఫేస్, హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.బాగా పండిన బొప్పాయి గుజ్జును కూడా అరటిపండు మిశ్రమంలో కలపవచ్చు.అలాగే యాపిల్ ముక్కలు, నారింజ గుజ్జును కూడా కలిపి ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ ల రాసుకోవాలి ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ద్వారా శీతాకాలంలో సహజంగా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.

అలాగే ఇదే మిశ్రమాన్ని తలకు కూడా అప్లై చేయవచ్చు.బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ తలలో పేరుకు పోయే చుండ్రును శుభ్రం చేసే అద్భుతమైన ఏజెంట్‌గా పనిచేస్తుంది.నారింజలో విటమిన్ సి కూడా జుట్టుకు మంచి పోషణను ఇస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube