చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకుంటుంటురు.అందులో కుక్కలు, పిల్లులు, రామచిలుకలు, కుందేళ్లు వంటి ఉంటాయి.
మరికొందరైతే ఫన్నీగా ఎలుకలను కూడా పెంచుకుంటారు.కానీ ‘గిగి విటాలే’ అనే పదమూడేళ్ల బాలిక మాత్రం వింతగా రెండు కప్పలను పెంచుకుంటోంది.
వాటితో ఆడుకుంటుంటే తనకు చాలా టైంపాస్ అవుతుందని చెబుతోంది .గిగి.తన వద్ద గ్రీన్ కలర్‌లో ఉన్న రెండు చిన్న కప్పలు ఉన్నాయి.వాటికి పేర్లు కూడా పెట్టింది ఈ బాలిక.ఒకదాని పేరు ‘మూ’.మరొకటి ‘మోచీ’.
ఈ రెండు కప్పలే తన ప్రపంచం అని చెబుతోంది.
ఐదు నెలలుగా గిగి వాటితో ఎంతో స్నేహంగా మెలుగుతోంది.
వర్షాకాలం సమయంలో ఆ రెండు చిన్న కప్పలు ఇంటి పెరట్లో గిగికి దొరికాయట.వాటిని చూసి మొదట భయపడినా తర్వాత వాటిని చూస్తూ మమకారాన్ని పెంచేసుకుందట.
కొవిడ్ సమయంలో పాఠశాలలు అన్ని మూతబడ్డాయి.ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు.
దీంతో ఆ కప్పలతోనే స్నేహం చేస్తూ వాటితోనే ఆడుకునేదట గిగి.వీటితో స్నేహం చేశాకే ప్రకృతి, జంతువుల పైన ఇష్టాన్ని పెంచుకున్నట్టు ఈ బాలిక చెబుతోంది.
కప్పలపై చాలా లోతైన రీసెర్చ్ చేసిన తర్వాతే గిగీ వాటిని ఇంట్లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.అంతేకాకుండా వాటికి డిఫరెంట్ ఆహారం కూడా అందిస్తోందట.వాటిని చూసినప్పుడుల్లా అవి నవ్వుతున్నట్టు కనిపిస్తాయని గిగి చెబుతోంది.కొవిడ్ టైంలో ఇంట్లో ఉండి కప్పలతో ఆడుకుంటూ చాలా వీడియోలు చేసి తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది.
గిగి.వాటికి చాలా లైక్స్ వచ్చాయి.
ఆమె అకౌంట్‌కు 46 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారట.కప్పలను బయటకు తీసుకెళ్లితే చాలా హ్యపీగా ఫీలవుతాయని చెబుతోంది ఈ బాలిక.
మూ అనే కప్ప ఎప్పుడు ఇంట్లోనే ఉంటుందని.మోచీ మాత్రం బయట తిరిగేందుకు ఇష్టపడుతుందని గిగి పేర్కొనడం విశేషం.