ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు దక్షిణ కోస్తా అదే రీతిలో రాయలసీమలో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రైతులు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనడం తెలిసిందే.ఊహించని రీతిలో వర్షాలు భారీగా పడటంతో… వాగులు వంకలు పొంగి పొర్లి.
రిజర్వాయర్లు కూడా దెబ్బతిని ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలోకి నీళ్లు చేరుకున్న ఘటనలు ఉన్నాయి.ఈ క్రమంలో చాలామంది ఇల్లు లేక నిరాశ్రయులయ్యారు.
ఇటువంటి తరుణంలో సీఎం జగన్ రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడం జరిగింది.ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పర్యటనలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఓ మహిళ తనకు భూమి విషయంలో అన్యాయం జరిగిందని.
అనేకసార్లు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా గాని.ఎవరూ పట్టించుకోలేదని.
తెలపటంతో పాటు పత్రాలు జగన్ కి చూపించారు.దీంతో మొత్తం పాత్రలు పరిశీలించిన జగన్ మహిళ విషయంలో అన్యాయం జరిగిందని గుర్తించి.
.వెంటనే ఆ అన్యాయానికి కారకుడు అయినా వీఆర్వో ని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తున్నట్లు జగన్ ఆదేశాలు జారీ చేశారు.
బాధిత మహిళ తనకు ఇద్దరు ఆడపిల్లలు వున్నారని మీరే న్యాయం చేయాలని తెలపటంతో అధికారులు చూసుకుంటారని అధైర్యపడాల్సిన అవసరం లేదని సదరు మహిళకు ధైర్యం చెప్పి… ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి దానికి కారకులైన అధికారులను.వెంటనే అక్కడ జగన్ సస్పెండ్ చేయడంతో చుట్టుపక్కల ప్రజలు.
మరియు అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నట్లు సమాచారం.అయితే ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో “ఒకే ఒక్కడు” సినిమా ని.
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో సీఎం జగన్ చూపిస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా ఈ సినిమా 1999 లో రిలీజ్ అయింది. అప్పట్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.ముఖ్యమంత్రిగా అర్జున్ యాక్టింగ్ సినిమాకి హైలెట్.
ఈ క్రమంలో అర్జున్ ముఖ్యమంత్రి హోదాలో ప్రజల వద్దకు వెళ్లి నేరుగా వారి సమస్యలను.తీరుస్తూ ప్రభుత్వ వ్యవస్థలో ఉండే అవినీతిపరుల భరతం పట్టడం మాత్రమేకాక సామాన్యులకు భారంగా ఉండే ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేసుకుంటూ పోతుంటాడు.
ఇప్పుడు ఇదే మాదిరిగా వరద ప్రాంతాల్లో పర్యటన లో సీఎం జగన్ ఒక మహిళ కి అన్యాయం చేసిన వీఆర్వో ని సస్పెండ్ చేయడం.సంచలనంగా మారింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో రావటంతో జగన్ ఒకే ఒక్కడు సినిమా ని.గుర్తు చేస్తున్నాడు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.