అమెరికాలో జరిగిన ఈ ఘటన అచ్చం మన తెలుగు సినిమా స్టొరీ లానే ఉందిగా...

హాస్పటల్ లో తల్లికి బిడ్డ పుడుతుంది, అదే సమయంలో పక్క రూమ్ లో మరో తల్లి బిడ్డకు జన్మనిస్తుంది.అనుకోని కారణాల వలన బిడ్డలు ఒకరి తల్లి నుంచీ మరొక తల్లికి మారిపోతారు.

 This Event In America Is Like Our Telugu Movie Story , America, California, Da-TeluguStop.com

కట్ చేస్తే కొన్నేళ్ళ తరువాత పిల్లలు ఎదిగే క్రమంలో వాళ్ళు తమ పిల్లలు కాదని తెలుసుకుని అసలు పిల్లల కోసం వెతుకుతారు.ఇలాంటి సినిమాలు మన తెలుగు తెరపై ఎన్నో చూసి ఉంటాము.

అయితే ఇంచుమించు ఇలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన డాఫ్నా అనే మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

లాస్ ఏంజిల్స్ లో ఉండే కాలిఫోర్నియా సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ హాస్పటల్ లో కృతిమ గర్భదారణ విధానం ద్వారా బిడ్డను కంది.అయితే ఈ ప్రయత్నమే ఆమె కొంప ముంచింది.

ఆమె నుంచీ సేకరించిన అండాన్ని భర్త వీర్యకణంతో జత చేసి సంతానాన్ని పొందేలా చేశారు అక్కడి వైద్యులు.కొన్ని నెలల తరువాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

ఇక్కడి వరకూ బాగానే గడిచింది.కొన్ని నెలలు తమ బిడ్డతో సంతోషంగా గడుపుతున్న వారికి బిడ్డ పోలికలు, రంగు చూసి తమ బిడ్డా కాదా అనే సందేహం కలిగింది.

ఇలా కొన్ని నెలలు సందేహాలతో గడిపిన దంపతులకు బిడ్డ తమదో కాదో తెలుసుకునేందుకు DNA టెస్ట్ చేయించాలని భావించారు.తమకు కృత్రిమ పద్దతిలో బిడ్డను అందించిన అదే హాస్పటల్ కు బిడ్డను తీసుకువెళ్ళి టెస్ట్ లు చేయించగా ఆ బిడ్డ వారి బిడ్డ కాదని రిజల్ట్ రావడంతో షాక్ అయ్యారు.

దాంతో హాస్పటల్ యాజమాన్యాన్ని నిలదీయగా ఆ సమయంలో సాంపిల్స్ మారిపోయినట్టుగా గుర్తించారు.దాంతో తమ బిడ్డకోసం అన్వేషించి 2020 మార్చ్ నెలలో తమ అసలు బిడ్డను కనుగొని ఇంటికి తెచ్చుకున్నారు.

అయితే తమకు ఇంతటి ఆవేదన మిగిల్చిన సదరు హాస్పటల్ పై కేసు వేయాలని భావించిన ఇరు వర్గాల దంపతులు తమకు న్యాయం జరగాలని ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube