షణ్ముఖ్ జస్వంత్.ఈ పేరు ప్రస్తుతం సోషలో మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంటుంది.
సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలో రాణించేందుకు మనోడు తెగ కష్టపడుతున్నాడు.షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ స్టార్‌గా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
ఫేస్‌బుక్, షేర్‌చాట్ వంటి టైంపాస్ యాప్స్‌లో మనోడి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.షణ్ముక్ తన కెరీర్ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూనే మరోవైపు మంచి డ్యా్న్సర్‌గా రాణించాలనుకున్నాడు.
‘ది సాఫ్ట్‌వేర్ డెవలపర్’ సిరీస్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఆ తర్వాత ‘సూర్య’ సిరీస్ లో అప్పటికే యూట్యూబ్ స్టార్ అయిన మౌనికతో నటించి మంచి గుర్తింపు పొందాడు.
సూర్య క్యారెక్టర్‌తో యువతను ఎంతగానో మెప్పించి తన కెరీర్‌కు ఒక ఫ్లాట్ ఫాంను బిల్డ్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ‘బిగ్ బాస్- 5’ గేమ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్న షణ్ముక్ తనదైన ఆటతీరుతో హౌస్‌మెట్స్ అందరికంటే ముందుండాడు.
బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులను పూర్తి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తు్న్న వారిలో ముందు వరుసలో నిలిచాడు.కాగా, షణ్ముక్, దీప్తి సునయనల ప్రేమ వ్యవహారం నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటుంది.
ఈ టాపిక్ ఎప్పుడు వచ్చిన అభిమానులు ఇది నిజమా కాదా అని అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంటారు.అయితే, ఇటీవల షణ్ముఖ్ బర్త్ డే సందర్భంగా దీప్తి సునయన బిగ్‌బాస్ అభిమానుల సాక్షిగా తన లవర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేసింది.
పుట్టినరోజు కానుకగా ‘‘షన్నూ.ఐ లవ్ యూ’ అని దీప్తి చెప్పగానే.షణ్ముఖ్ తెగ సిగ్గుపడిపోయాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే వీరిద్దరి లవ్ స్టోరీపై మీ ఒపీనియర్ ఏమిటని షణ్ముఖ్ తల్లిగారిని అడుగగా ఆమె ఇచ్చిన సమాధానం విని మరోసారి అందరూ షాక్ అయ్యారు.చాలా సింపుల్‌గా వారిద్దరికి ఇష్టం అయితే మాకు ఇష్టమే.
అన్నారు షణ్ముక్ తల్లి.దీంతో వీరికి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు అయ్యింది.