బిగ్ బాస్ కార్యక్రమం గురించి మొదట్లో నాగార్జున చెప్పినట్లు గత సీజన్లో కంటే ఈ సీజన్ ప్రేక్షకులను ఐదురెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది అంటూ చెప్పినట్టుగానే ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మరుసటి రోజు నుంచి కంటెస్టెంట్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టు గొడవలు పడుతూ బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లలో ఒకరిని మించి ఒకరు పాల్గొంటూ ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.
ప్రేక్షకుల కోసం కంటెస్టెంట్స్ ఎంత ఎంటర్టైన్ చేసినా కూడా ప్రతి వారం హౌస్ నుంచి ఒకరు బయటకు రావాల్సిందే.ఈ విధంగా బిగ్ బాస్ ప్రారంభమైన మొదటి వారంలోనే సెవెన్ ఆర్ట్స్ మరియు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
ఇక రెండవ వారం నామినేషన్ లిస్ట్ లో ఉన్నటువంటి ఉమాదేవి రెండవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చింది.ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్ లను హౌస్ లో ఉన్నటువంటి వారి గురించి వారి ఫీలింగ్స్ ఏంటి అనే విషయాల కోసం బిగ్ బాస్ గత రెండు సీజన్ల నుంచి బిగ్ బాస్ బజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమానికి ప్రస్తుతం అరీయానా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.తాజాగా రెండవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన ఉమాదేవితో ముచ్చటించిన ఆరియానా ఈ కార్యక్రమంలో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి ఉమాదేవి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా సిరి షణ్ముఖ్ గురించి ఉమాదేవి హాట్ కామెంట్ చేశారు.వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయితే మంచాలు కూడా పక్కపక్కనే వేసుకోవాలా అంటూ… ఉమాదేవి వీరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సిరి హౌస్ లో ఎంతో ప్లాన్డ్ గా ఆడుతోందని.షణ్ముఖ్ కూడా సిరి మాటలు వింటూ సిరి చెప్పినట్టు గేమ్ ఆడుతున్నాడని ఉమాదేవి ఆరోపించారు.ఈ క్రమంలోనే ఉమాదేవి షణ్ముఖ్ ను ఉద్దేశిస్తూ నీ ఆట నువ్వు ఆడు… లేదంటే ఇంకొక రెండు వారాలలో నువ్వు హౌస్ నుంచి బయటకు వస్తావు అంటూ షణ్ముఖ్ గురించి ఉమాదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
షణ్ముఖ పూర్తిగా సిరి ఆడించినట్లు ఆడుతున్నారని,ఇలా సిరి చెప్పిన మాటలు వింటే ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ఉండడని తెలియజేసింది.ఇలా బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్న ఈమె హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.