వినాయకుడి పూజలో తులసీ దళాలను వాడక పోవడానికి కారణం ఏంటో తెలుసా?

హిందూ దేవదేవతలలో ఏ కార్యం చేసిన, ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడి పూజ నిర్వహించిన తర్వాతనే పూజా కార్యక్రమాలను లేదా శుభ కార్యక్రమాలను ప్రారంభిస్తారు.ఈ విధంగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యంలో ఏవిధమైన ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్విఘ్నంగా ఆ శుభకార్యం పూర్తవుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

 Do You Know The Reason For The Not Use Of Tulsi In The Worship Of Ganesha, Ganes-TeluguStop.com

ఈ విధంగా వినాయకుడిని ఎంతో పరమపవిత్రంగా వివిధ రకాల పుష్పాలు, దళాలతో పూజిస్తారు. అయితే వినాయకుడి పూజలో తులసీ దళాలను ఉపయోగించరనే విషయం మీకు తెలుసా? అసలు వినాయకుడి పూజలో ఎంతో పవిత్రమైన తులసి దళాలను ఎందుకు ఉపయోగించరు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది.తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఎంతో పవిత్రమైన ఈ తులసీదళాలతో శ్రీహరిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.ఇంత పవిత్రమైన తులసి దళాలను వినాయకుని పూజలో ఉపయోగించక పోవడానికి కారణం ఏమిటంటే.

పురాణాల ప్రకారం వినాయకుడు ఓ నదీ పరీవాహక ప్రాంతానికి తపస్సు చేయడానికి వెళ్తాడు.ఆ సమయంలో వినాయకుడిని చూసిన ధర్మ ద్వజ యువరాణి అతనిపై ఇష్టం కలిగి తనని వివాహం చేసుకోమని వినాయకుడిని వేడుకుంటుంది.

వినాయకుడు ఆ యువరాణిని పెళ్లి చేసుకోవడం వల్ల తన తపస్సుకి భంగం కలుగుతుందని భావించి తనతో వివాహానికి నిరాకరిస్తాడు.అయితే తనతో వివాహాన్ని నిరాకరించడం వల్ల ఎంతో ఆగ్రహం చెందిన ధర్మధ్వజ యువరాణి వినాయకుడినికి బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేస్తారంటూ శాపం పెడుతుంది.

ఇలా వినాయకుడి కి శాపం పెట్టడం వల్ల ఆగ్రహం చెందిన గణనాథుడు ధర్మ యువరాణి వివాహం ఒక రాక్షసుడితో జరుగుతుందని శాపం పెడతారు.వినాయకుడి శాపం వల్ల ఎంతో బాధపడితన తప్పును తెలుసుకున్న యువరాణి తనకు శాపవిమోచనం కల్పించమని వేడుకుంటుంది.

Telugu Ganesh Festival, Tulsi, Worship-Latest News - Telugu

ఈ క్రమంలోనే వినాయకుడు శాపవిమోచనం అసాధ్యమైన పని కనుక వినాయకుడు కొన్ని సంవత్సరాల పాటు రాక్షసుడితో కలిసి జీవించినప్పటికే ఆ తరువాత మరణించి ఎంతో పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని వరం ఇచ్చారు.అయితే తులసి మొక్క గా జన్మించిన నీవు నా పూజకు అనర్హురాలు అంటూ వినాయకుడు ఆ యువరాణికి వరం ఇస్తారు.ఇలా కొన్ని రోజులపాటు రాక్షసుడితో కలిసి జీవించిన యువరాణి మరణం చెంది ఆ తరువాత తులసి మొక్కగా జన్మిస్తుంది.గతజన్మలో వినాయకుడికి తులసికి మధ్య ఉన్న విభేదాల కారణంగా తులసి దళాలతో వినాయకుడికి పూజ చేయరు.

ఈ విధంగా తులసి దళాలు వినాయకుని పూజకు అనర్హులనీ పండితులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube