మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా తెలుగులో పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మొదటి సాంగ్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లేటెస్ట్ గా పవర్ స్టార్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
పవర్ స్టార్ సాంగ్ రిలీజైతే ఇంటర్నెట్ లో షేక్ ఆడాల్సిందే.సాంగ్ రిలీజైనప్పటి నుండి భీమ్లా నాయక్ సాంగ్ బాగా వినిపిస్తుంది.
అయితే ఈ సాంగ్ వీడియో గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడ్డది.సినిమాలో ఈ సాంగ్ వర్షన్ వేరేలా ఉంటుందట.
జస్ట్ ఈ సాంగ్ కు రిలీజ్ చేసింది కవర్ సాంగ్ మాత్రమే అని తెలుస్తుంది.దీనికోసం భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్స్ 40 లక్షల దాకా ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.
పవన్ సినిమాకు ఎంత పెట్టినా తక్కువే అనేలా భీమ్లా నాయక్ నిర్మాత ఉన్నట్టు తెలుస్తుంది.సినిమాలో రానా కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.
అయితే ఫోకస్ మొత్తం పవన్ మీదె పెట్టారని దగ్గుబాటి ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రం కథనం, మాటలు అందిస్తున్నారు.