ప్రస్తుత కాలంలో బుల్లితెర ద్వారా, టిక్ టాక్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల ద్వారా పాపులారిటీని సంపాదించుకుంటున్న సెలబ్రిటీలు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ను ప్రారంభిస్తూ ఆ ఛానల్స్ ద్వారా క్రేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆయా సెలబ్రిటీలు భారీ మొత్తంలో ఆదాయం సంపాదించుకుంటూ ఉండటం గమనార్హం.
యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న విష్ణుప్రియ ఆ తర్వాత బుల్లితెర యాంకర్ గా ఆఫర్లు రావడంతో బుల్లితెరకు ప్రాధాన్యత ఇచ్చారు.మరోవైపు వెండితెరపై వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ విష్ణుప్రియ పలు సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో కూడా నటించారు.
అయితే ఈ మధ్య కాలంలో బుల్లితెరపై విష్ణుప్రియ ఎక్కువగా సందడి చేయడం లేదు.
తాజాగా ప్రసారమైన జబర్దస్త్ షోలో విష్ణుప్రియ మెరిశారు.
సొంతంగా రుద్ర అనే పేరుతో విష్ణుప్రియ ఫౌండేషన్ ను కూడా స్థాపించారు.అధ్యాత్మిక భావన, దైవ చింతన వల్లే ప్రస్తుతం విష్ణుప్రియ బుల్లితెర షోలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.అయితే సేవా కార్యక్రమాలు చేయడానికి డబ్బులు ఏ విధంగా వస్తున్నాయనే ప్రశ్నలకు విష్ణుప్రియ ఆసక్తికర సమాధానాలను చెప్పుకొచ్చారు.
తన కుటుంబం బాగా సెటిల్ అయిందని తాను యాంకర్ గా పని చేసిన సమయంలో బాగా సంపాదించానని ఆమె అన్నారు.యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి ఆదాయం వస్తోందని బ్రాండ్ ప్రమోషన్ చేయడం ద్వారా కూడా సంపాదిస్తున్నానని అమె అన్నారు.ప్రతి నెలా లక్షల్లో తన అదాయం ఉందని విష్ణుప్రియ చెప్పకనే చెప్పేశారు.
సెలబ్రిటీలకు యాంకరింగ్ ద్వారా వచ్చే ఆదాయం కంటే బ్రాండ్స్ ప్రమోషన్స్ ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ మొత్తంలో ఉండటం గమనార్హం.విష్ణుప్రియ సంపాదన గురించి తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.