నటిని బిచ్చగత్తెతో పోల్చిన నెటిజన్లు.. డ్రెస్ అలా ఉండటంతో?

ఫ్యాషన్ రంగంలో రోజురోజుకు ఎన్నో మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే.చిరిగిన జీన్స్ నే ప్రస్తుతం చాలామంది ఫ్యాషన్ గా భావిస్తున్నారు.

 Netizens Trolls Urvashi Ripped Jeans Goes Viral In Social Media, Goes Viral, Net-TeluguStop.com

సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్లు డిఫరెంట్ డ్రెస్సుల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.అయితే కొన్నిసార్లు ఆ డిఫరెంట్ డ్రెస్సుల వల్లే సెలబ్రిటీలు నెటిజన్లతో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు.

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తాజాగా ఊర్వశి రౌతేలా చిరిగిన జీన్స్ లో దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ కాగా ఆ ఫోటోలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఫోటోలలో ఊర్వశి రౌతెలా డెనిమ్ జాకెట్ ధరించగా ఊర్వశి వేసుకున్న జీన్స్ ముందు వెనుక చినిగిపోయి ఉండటం గమనార్హం.

ఆ ఫోటోలను చూసిన నెటిజన్లలో కొంతమంది ఊర్వశి డ్రెస్ డిజైనర్ ను పట్టుకోవాలని కామెంట్లు చేస్తుండగా మరి కొందరు మాత్రం ఊర్వశి రౌతెలా చూడటానికి బిచ్చగత్తెలా ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.

Telugu Bollywood, Denim Jacket, Sense, Offers, Netizens, Ripped Jeans, Urvashi R

బిచ్చగత్తెలు మాత్రమే ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారని దారుణంగా ఊర్వశిని ట్రోల్ చేస్తున్నారు.మరి కొందరు ఊర్వశి రౌతెలా వేసుకున్నది డ్రెస్సా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెట్టడం గమనార్హం.

Telugu Bollywood, Denim Jacket, Sense, Offers, Netizens, Ripped Jeans, Urvashi R

అయితే నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లపై ఊర్వశి రౌతెలా అభిమానులు మాత్రం మండిపడుతున్నారు.ఊర్వశి రౌతెలాకు ఇష్టమైన బట్టలు వేసుకునే హక్కు ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఊర్వశికి ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని నచ్చిన విధంగా జీవించే హక్కు ఆమెకు ఉందని అభిప్రాయపడుతున్నారు.నెగిటివ్ కామెంట్లపై ఊర్వశి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఊర్వశి రౌతెలాను ప్రశ్నించడానికి మీరెవరని ఆమెకు నచ్చిన విధంగా జీవించే అధికారం ఉందని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube