టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు పెట్టుకొని ఉంటారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకు ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సాధారణంగా ఏ హీరో సినిమా అయినా ఫ్లాప్ అయితే ఆ తర్వాత సినిమా పెద్దగా మార్కెట్ చేయలేదని చెప్పవచ్చు.కానీ పవన్ కళ్యాణ్ మార్కెట్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది.
ఈ క్రమంలోనే చాలా సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఓటీటీ హక్కులను కూడా భారీ స్థాయిలోనే కొనుగోలు చేశాడు.
ఈ క్రమంలోనే మలయాళ చిత్రమైన “అయ్యప్పనుమ్ కొషియమ్” ఈ చిత్రాన్ని తెలుగులో “భీమ్లా నాయక్” గా తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా ఇందులో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం బారీ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా హాట్ స్టార్ కొనుగోలు చేయాలని భావించినప్పటికీ నిర్మాతలు భారీ మొత్తం చెప్పడంతో వారు వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అమెజాన్ ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది.వకీల్ సాబ్ కంటే అత్యధికంగా 15 కోట్ల వరకు ఆఫర్ చేయడానికి అమెజాన్ సిద్ధమైనట్లు సమాచారం.
అదేవిధంగా శాటిలైట్ హక్కులను కూడా పది కోట్లకు దక్కించుకోవాలని అమెజాన్ ప్రయత్నాలు చేస్తున్నారు.మరి అమెజాన్ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో లేదా వేచిచూడాలి.