న్యూస్ రౌండప్ టాప్ 20

1.అభిషేక్ బచ్చన్ కు అత్యవసర చికిత్స

Telugu Amitha Bachhan, Ap Telangana, Chirenjeevi, Del, God, Lokesh, Maharstra, S

  బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ లో గాయపడినట్లు సమాచారం.వెంటనే ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు.
 

2.మూడు చింతపల్లి కి రేవంత్

  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి కి బయలుదేరి వెళ్లారు.
 

3.కలెక్టర్లతో మంత్రి సబితా వీడియో కాన్ఫరెన్స్

  పాఠశాలలో ప్రత్యక్ష బోధన పై కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 

4.ప్రగతి భవన్ వద్ద ఆందోళన

   హైదరాబాదులోని ప్రగతి భవన్ ముట్టడికి  నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

5.కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

Telugu Amitha Bachhan, Ap Telangana, Chirenjeevi, Del, God, Lokesh, Maharstra, S

  రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి తలపెట్టిన 48గంటల దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
 

6.ప్రతి ఆదివారం ట్యాంక్ ట్రాఫిక్ ఆంక్షలు

  హైదరాబాద్ నగర వాసులు సందర్శనార్థం ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్  ట్రాఫిక్ ఆంక్షలు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
 

7.ఏపీ వైకాపాబన్లు : లోకేష్ కామెంట్స్

Telugu Amitha Bachhan, Ap Telangana, Chirenjeevi, Del, God, Lokesh, Maharstra, S

  ఆంధ్రప్రదేశ్ వైకాపా బన్లు అరాచకాల లో ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్లను మించిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
 

8.  ఏపీ చలాన్ల స్కాం

  ఏపీ లో సంచలనం సృష్టించిన చలానా స్కామ్ లో ముగ్గురు సబ్ రిజిస్టర్ పై సస్పెన్షన్ వేటు వేశారు.కృష్ణాజిల్లా పడమట సబ్ రిజిస్టర్ వి.వెంకటేశ్వర్లు, మండవల్లి సబ్ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యం తోపాటు, కడప సబ్ రిజిస్టర్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
   

9.అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ

Telugu Amitha Bachhan, Ap Telangana, Chirenjeevi, Del, God, Lokesh, Maharstra, S

  ఏపీ వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు ను ఏపీ ప్రభుత్వం జమ చేసింది.పదివేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు 207 .61 కోట్లు 20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు 459.23 కోట్ల నగదు చెల్లింపులు చేశారు.
 

10.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 25,467 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

11.డెల్టా ప్లస్ కేసుల కలకలం

Telugu Amitha Bachhan, Ap Telangana, Chirenjeevi, Del, God, Lokesh, Maharstra, S

  మహారాష్ట్రలో మళ్లీ కరుణ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి.ఇప్పటి వరకు ఇక్కడ 103 కేసులు వెలుగులోకి వచ్చాయి.
 

12.గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటన

  గుంటూరు నగరంలో జాతీయ ఎస్సీ కమిషన్ ఈ రోజు పర్యటిస్తోంది.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

ఇటీవల హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య ఇంటికి చేరుకున్నారు.ఆమె హత్య పై  కమిషన్ సభ్యులు  విచారణ చేపట్టారు.
 

13.పూరి జగన్నాథ్ దేవాలయం పునః ప్రారంభం

Telugu Amitha Bachhan, Ap Telangana, Chirenjeevi, Del, God, Lokesh, Maharstra, S

  గత నాలుగు నెలలుగా తరుణ కారణంగా మూతపడిన పూరి జగన్నాథ్ దేవాలయం మళ్లీ యధావిధిగా ప్రారంభమైంది.
 

14.ఉపఎన్నికలు నిర్వహించాలి

  రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.
 

15.ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ ప్రైవేటు కు

  కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు నిర్వహణ ఇక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు.ఈ ఆస్తుల నగరీకరణ ద్వారా నాలుగేళ్లలో ఆరు లక్షల కోట్లు సమకూర్చుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 

16.మూడో ముప్పు తప్పదు

  కరోనా మూడో ఉధృతి సెప్టెంబర్, అక్టోబర్ లో దేశాన్ని చుట్టుముట్టనున్నాయి అని రెండు కీలక సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి.
 

17.’ గాడ్ ఫాదర్ ‘ కు సల్మాన్ డేట్స్

Telugu Amitha Bachhan, Ap Telangana, Chirenjeevi, Del, God, Lokesh, Maharstra, S

  మెగాస్టార్ చిరంజీవి ” లూసీఫర్ ” ఈ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.దీనికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఖరారు చేసారు.ఈ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అంగీకారం తెలుపుతూ డేట్స్ ఇచ్చారు.
 

18.తెలంగాణలో మరో 200 మద్యం షాపులు

  తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 2,216 లిక్కర్ షాపుల తోపాటు, అదనంగా మరో 200 లిక్కర్ షాపులను కూడా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
 

19.మార్షల్ ఆర్ట్స్ లో శృతిహాసన్ శిక్షణ

Telugu Amitha Bachhan, Ap Telangana, Chirenjeevi, Del, God, Lokesh, Maharstra, S

  ప్రభాస్ సరసన నటించబోతున్న శృతిహాసన్ కు ఆ సినిమాలు కొన్ని ఫైట్ సీన్ కూడా ఉండడంతో ఆమె మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -44,450   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,490

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube