బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ వాణి కపూర్.తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక టాలీవుడ్ లో ఆహా కల్యాణం సినిమాలో నటించగా ఈ సినిమా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఆ తర్వాత టాలీవుడ్ లో మళ్లీ ఎటువంటి అవకాశాలు కూడా అందుకోలేదు.
బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లతో దూసుకుపోతుంది.వరుస సినిమాలలో తెగ అవకాశాలు అందుకుంటుంది.
ఇదిలా ఉంటే డబ్బులతో ఇబ్బందులు ఎదుర్కుంటుందట వాణికపూర్.
కొన్ని విషయాలను పంచుకున్న వాణికపూర్.
ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురుకుందట.తన 18 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆర్థికంగా తనకు కష్టాలు వచ్చాయని.
ఆ సమయంలో తన కుటుంబానికి తానే అండగా నిలబడాలనే ఆలోచనలతో కుటుంబ బాధ్యతలను తీసుకుందట.ప్రతి ఒక్కరి పరిస్థితులు ఎలాంటి పరిస్థితిలో కైనా దిగజారుతాయని.
కానీ వాటిని ధైర్యంగా తట్టుకొని నిలబడినప్పుడే తన జీవితం ముందుకు సాగుతుందని తెలిపింది వాణికపూర్.
అంతేకాకుండా ప్రతి ఒక్కరిని ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్లాలనే శక్తి ఉండాలని తెలిపింది.ఇక తను నటిగా ఎదుగుతున్న సమయంలో తన తల్లిదండ్రుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.తన సొంతంగానే డబ్బులను సంపాదించుకొని.
ఈ స్థాయిలో ఉన్నానని తెలిపింది.ఇక ఇప్పుడున్న ఈ స్థాయిలో గతంలో పడిన కష్టాలు తలుచుకుంటే మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ధైర్యాన్ని ఇస్తుంది అని తెలిపింది.ఇక ప్రస్తుతం వాణికపూర్ వరుస సినిమాలలో బిజీగా ఉంది.అక్షయ్ కుమార్ నటిస్తున్న బెల్ బాటమ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక షామ్ శ్రీ అనే సినిమాలో కూడా నటిస్తుంది.అంతేకాకుండా టాలీవుడ్ లో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది ఈ బ్యూటీ.
అంతే కాకుండా బాలీవుడ్ లో పలు అవకాశాలు కూడా అందుకుంటుంది.