కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకున్నా పెద్దగా సినిమాలను రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ధైర్యం చేయలేదు.అయితే ఓ చిన్న సినిమా మాత్రం తాము తీసిన కథపై నమ్మకంతో, ప్రేక్షకులు ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్‌తో ఆగస్టు 6న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు.
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జావల్కర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘SR కళ్యాణమండపం’ అనే సినిమా ఆగస్టు 6న థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను తెచ్చుకుంది.దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు వెళ్లారు.
అందరి అపోహలను తారుమారు చేస్తూ కంటెంట్ బాగుంటే సినిమాను థియేటర్లలో ఖచ్చితంగా చూస్తామని ఆడియెన్స్ ఈ సినిమాకు ఇచ్చిన రెస్పాన్స్‌తో తేలిపోయింది.దీంతో వరుసబెట్టి ఇప్పుడు తమ సినిమాలను దర్శకనిర్మాతలు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.
అయితే SR కళ్యాణమండపం చిత్రం విషయానికి వస్తే తక్కవ బడ్జెట్‌తో తెరకెక్కిన క్లీన్ అండ్ నీట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది.అటు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టడంలో సక్సెస్ అయ్యింది.
దీంతో చిత్ర నిర్మాతలు ఫుల్ ఖుషీ చేసుకున్నారు.అయితే ఇప్పుడు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సినిమాను మంచి ఫ్యాన్సీ రేటుకు ఆహా సొంతం చేసుకుంది.ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ను చూసిన ఆహా నిర్వాహకులు ఈ సినిమాను ఆగస్టు 27న డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తున్నారు.
అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది.ఏదేమైనా ‘SR కళ్యాణమండపం’ విజయం చాలా సినిమాలకు స్పూర్తినిచ్చిందనడంలో సందేహం లేదు.
ఈ సినిమాను శ్రీధర్ గాదె డైరెక్ట్ చేశారు.మరి ఈ సినిమాకు డిజిటిల్ ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తారో చూడాలి.