నేడు కేసీఆర్ సభ ! ఒక పక్క ఏర్పాట్లు మరో పక్క ఆందోళన

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ వేదికగా ప్రకటించబోతున్నారు.ఈ దళిత బంధు పథకాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

 Telangana Cm Kcr Public Meeting On Dalitha Bandhu In Huzurabad Today, Kcr, Telan-TeluguStop.com

ఒక దళిత కుటుంబానికి 10 లక్షలు అందించడం ద్వారా, టిఆర్ఎస్ కు తెలంగాణలో తిరుగు లేకుండా చేసుకోవాలని, ఆ సామాజిక వర్గం పూర్తిగా టిఆర్ఎస్ వైపు ఉండేలా చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు.

త్వరలోనే ఇక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కెసిఆర్ ముందుగానే అలర్ట్ అయ్యి ఈ భారీ బడ్జెట్ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈ దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద కెసిఆర్ ప్రారంభిస్తున్నారు.

ముందుగా ఈ పథకానికి అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని కెసిఆర్ అందించనున్నారు.దీనికోసం ప్రభుత్వం 500 కోట్ల నిధులను విడుదల చేసింది.

ఈ పథకం ను సక్సెస్ ఫుల్ గా అమలు చేసి తీరుతామని టిఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది.ఈ మేరకు హుజురాబాద్ లో కెసిఆర్ భారీగానే అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సభ జరగనుంది.సుమారు వంద అడుగుల పొడవు, 43 అడుగుల వెడల్పుతో భారీ వేదిక సైతం ఏర్పాటు చేశారు.

ఈ ఏర్పాట్లు అన్ని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గం లోని మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాల నుంచి భారీ ఎత్తున జనాలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.

Telugu Dalitha Bandhu, Etela Rajendar, Hujurabad, Kcr, Telangana, Telangana Cm,

ఈ సభలోనే కెసిఆర్ రైతు బంధు పథకంతో పాటు, హుజురాబాద్ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించి ఈటెల రాజేందర్ పై ఘాటు విమర్శలు చేసేలా కనిపిస్తున్నారు.ఇది ఇలా ఉంటే,  ఈ దళిత బంధు పథకం అధికారికంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.ఈ పథకాన్ని హుజురాబాద్ లో మొదలు పెట్టడంతో తమ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని, ముందుగా హుజురాబాద్ వరకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయడంతో తమ నియోజకవర్గాల్లో పరిస్థితి తమకు ఇబ్బందికరంగా మారుతుందని, అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలనే డిమాండ్ మొదలవ్వడం వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో తమకు పెద్ద ముప్పే తీసుకొస్తాయని, ఈ పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో తమ గెలుపు పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందనే టెన్షన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల్లో నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube