అతిలోక సుందరి శ్రీదేవి ఆస్తుల విలువ అన్ని కోట్లా?

తెలుగుతో పాటు ఇతర భాషల్లో వందల సంఖ్యలో సినిమాల్లో నటించి నటిగా శ్రీదేవి మంచి పేరును సొంతం చేసుకున్నారు.అందం, అభినయం, ప్రతిభ ఉన్న నటిగా శ్రీదేవి పేరు తెచ్చుకున్నారు.

 Sridevi Has A Net Worth Of 250 Crore Rupees , 250 Crores , Janvi Kapoor, Movie E-TeluguStop.com

తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో శ్రీదేవి జన్మించగా శ్రీదేవి తండ్రి లాయర్ కావడం గమనార్హం.హీరోయిన్ శ్రీదేవి ఆస్తుల విషయానికి వస్తే శ్రీదేవి ఆస్తుల విలువ ఏకంగా 250 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

2018 సంవత్సరం డిసెంబర్ నెల 24వ తేదీన ప్రమాదవశాత్తు శ్రీదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే.అయితే శ్రీదేవి మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని ఇప్పటికీ ఆమె అభిమానులు భావిస్తున్నారు.

దుబాయ్ లో శ్రీదేవికి భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ ఉండటంతో శ్రీదేవికి మృతి సంభవించిందని గతంలో కొన్ని కథనాలు వెలువడ్డాయి.శ్రీదేవికి ఆస్తులతో పాటు లగ్జరీ కార్లు కూడా ఉన్నయని సమాచారం.

శ్రీదేవి పెద్దకూతురు జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఆమె మరణం సంభవించింది.త్వరలో శ్రీదేవి చిన్నకూతురు ఖుషి కపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

చిన్న వయస్సులోనే శ్రీదేవి బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టి తక్కువ సమయంలోనే విజయాలను అందుకున్నారు.వరుసగా తెలుగు, తమిళంలో స్టార్ హీరోలకు జోడీగా నటించి అప్పటి స్టార్ హీరోయిన్లకు శ్రీదేవి గట్టి పోటీ ఇచ్చారు.

Telugu Janvi Kapoor, Sridevi-Movie

బాలీవుడ్ లో కూడా శ్రీదేవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం గమనార్హం.బాహుబలి సిరీస్ సినిమాలో శివగామి పాత్రను పోషించే అవకాశం మొదట శ్రీదేవికే వచ్చింది.అయితే కొన్ని కారణాల వల్ల శ్రీదేవి ఆ పాత్రలో నటించే అవకాశాన్ని వదులుకున్నారు.దాదాపు మూడు దశాబ్దాల పాటు శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.

నటిగా శ్రీదేవి ప్రతిభకు ఎన్నో అవార్డులు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube