RRR : మరొక ప్రమోషనల్ వీడియోను వదిలిన తారక్..వీడియో వైరల్ !

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో ఆర్ ఆర్ ఆర్ సినిమాపై మంచి హైప్ వచ్చింది.ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు.

 Ntr Shares Another Video With Charan Goes Viral-TeluguStop.com

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఈ సినిమా కరోనా కారణంగా అనుకున్న సమయానికి రాదేమో అని అందరు అనుకున్నారు.కానీ రాజమౌళి ముందుగా ప్రకటించిన డేట్ కే ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే తెలిపాడు.

అందుకే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.ఇప్పటికే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ‘దోస్తీ సాంగ్‘ విడుదల అయి సూపర్ హిట్ అవ్వడంతో టీమ్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతుంది.ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసారు.

ప్రస్తుతం ఈ పాట షూటింగ్ జరుగుతుంది.ఈ సినిమా ఇంస్టాగ్రామ్ ను తారక్ హ్యాండిల్ చేస్తాడని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అలానే తారక్ కూడా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.తాజాగా తారక్ ఒక వీడియోను షేర్ చేసాడు.

అందులో తారక్ చరణ్ ఇద్దరు దోస్తీ సాంగ్ హమ్ చేస్తూ ఉక్రెయిన్ వీధుల్లో షూటింగ్ కు బయల్దేరారు.షూటింగ్ కు వెళ్తూ కారులో ఇద్దరు ఈ పాటను పడుతూ సందడి చేసారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.ఇలా రోజుకు ఒక వీడియో షేర్ చేస్తూ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు చిత్ర యూనిట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube