కరోనా కష్ట కాలంలో దేశ వ్యాప్తంగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు అందుకున్న సోనూ సూద్ గురించి తెలియని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు.ప్రపంచ వ్యాప్తంగా కూడా సోనూ పేరు మారుమోగి పోయింది.
ఎక్కడ సమస్య ఉన్నా సోనూ సూద్ చెవిన పడితే చాలు అక్కడికక్కడే వారి సమస్యలు పరిష్కారం అవుతాయి.కరోన సమయంలో పలు రాష్ట్రాలకు వలసలు వెళ్ళిన వారిని వారి వారి సొంత ప్రాంతాలకు తరలించడంతో మొదలు పెట్టిన సోనూ సాయం నేడు కంటి ఆపరేషన్లు, కాలేయ మార్పిడులు ఇలా ఒకటి కాదు రెండు కాదు లెక్కకు మించిన సమస్యలకు సోనూ పరిష్కారం చూపించారు.
హైదరాబాద్ లో కేవలం ఒక అపోలో ఆసుపత్రిలోనే దాదాపు 18 కాలేయ మార్పిడులు చేయించారు.అయితే తాను చేస్తున్న సేవలకు వైద్య సాయం నిత్యం అవసరమై ఉండే క్రమంలో సోనూ హైదరాబాద్ లోనే ఓ హాస్పటల్ కట్టడానికి ప్రణాళిక సిద్దం చేశారు.
తన ఫౌండేషన్ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మించదలచిన సోనూ అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలుగు సంస్థ అయిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ను సాయం కోరారు.
ఈ మేరకు తానా కమిటీ కీలక సభ్యులు అందరూ కలిసి సోనూతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు.తానా అమెరికాలో చేపట్టే సేవా కార్యక్రమాలు గురించి, అలాగే తెలుగు రాష్ట్రాలలో చేసే సేవా కార్యక్రమాల గురించి వివరించారు.తరువాత తానా టీమ్ తో మాట్లాడిన సోనూ సుదీర్ఘంగా తన సేవలను వివరిస్తూ హైదరబాద్ లో తన సంస్థ తరుపున చేపట్టనున్న హాస్పటల్ గురించి చెప్తూ తానా సాయం కోరారు.
అనారోగ్య సమస్యలు వచ్చినపుడు సొంత హాస్పటల్ ఉంటే మంచిదని అనిపించింది అందుకే హాస్పటల్ నిర్మాణం చేపడుతున్నాను తానా తరుపున రెండు లేదా మూడు బ్లాకుల నిర్మాణానికి సాయం అందిస్తే వాటికి తానా బ్లాక్ లు అని పేరు పెడుతామని సోనూ తెలిపారు.ఈ విషయంపై స్పందించిన తానా సభ్యులు.
మీరు చేసే సేవలకు తానా మద్దతు ఇస్తోంది.హాస్పటల్ నిర్మాణానికి కావాల్సిన సాయం మేము అందించడానికి సిద్దంగా ఉన్నామని తానా ఫౌండేషన్ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు.