సూపర్ ఐడియా..పిల్లల కోసం ఏకంగా ఐస్ క్రీం ట్రక్కునే కొనేసాడు..ఎందుకంటే ?

తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంత కష్టానైనా ఇష్టంగా భరిస్తారు.తమ పిల్లలే లోకంగా జీవిస్తారు.

తమ సంతోషాలను కూడా మర్చిపోయి వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.తాజాగా ఒక తండ్రి చేసిన పని మరొక సారి రుజువు చేసింది.

పిల్లల కోసం చేసిన పని అందరిని ఫిదా చేస్తుంది.ఇంతకీ ఏం చేశాడా అనేగా మీ డౌట్.

ఆగండి.అక్కడికే వస్తున్నా.

Advertisement

అమెరికాకు చెందిన జోయ్ వెనెజర్ తన పిల్లల కోసం గొప్పగా ఆలోచించాడు.తన ఆలోచనను అందరు మెచ్చు కుంటున్నారు.

సూపర్ ఐడియా అంటూ కితాబులు ఇస్తున్నారు.ఆయనకు 10 మంది పిల్లలు.

అయితే వారిలో ఇద్దరు పిల్లలు అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారు.వారిద్దరూ డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధ పడుతున్నారు.

ఆ ఇద్దరి కోసం చేసిన ఆలోచన అందరిని ఇంప్రెస్ చేస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

మేరీ కేట్, జోష్ ఇద్దరు డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడడం వల్ల మిగతా పిల్లల లా చదుకోలేదు.అందుకే వారికీ ఏ ఉద్యోగాలు దొరకవు కాబట్టి వారి పిల్లలు ఆర్ధిక సమస్యలతో బాధ పడకూడదని అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు.వారిలో స్కిల్స్ మెరుగు పరచాలని భావించిన జోయ్ వాళ్లకు ఐస్ క్రీమ్ వ్యాన్ కొని ఇచ్చాడు.

Advertisement

దీంతో పిల్లలకు జీవనోపాధి దొరుకుతుందని జోయ్ ఆలోచన.

ఇలా నలుగురిలో ఉంటే వారి పిల్లలకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని అనుకున్నాడు.ఐడియా వచ్చిందే తడవుగా ఐస్ క్రీం వ్యాన్ కొన్నాడు.ఇప్పుడు వారి పిల్లలిద్దరూ ఆ ఐస్ క్రీం బండిని నడుపుతున్నారు.

స్పెషల్ నీట్ ట్రీట్ అనే పేరు పెట్టి ఈ బిజినెస్ ను నడుపు తున్నారు.ఈ ఐస్ క్రీం బిజినెస్ బాగుందని జోయ్ వెనెజర్ చెప్పారు.

లోపం ఉందని పిల్లలను ఎవ్వరు ఎత్తి చూపకుండా మంచి ఐడియా చేసారని ఆయనను అభినందిస్తున్నారు.

తాజా వార్తలు