ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ సీజన్లో అత్యధికంగా వేధించే సమస్యల్లో జలుబు ముందు వరసలో ఉంటుంది.
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఈ సీజన్లో జలుబుకు గురై నానా పాట్లు పడుతుంటారు.ఇక ఈ మాయదారి జలుబు ఇంట్లో ఒకరికి వచ్చిందంటే.
మిగిలిన వారందరికీ సులువుగా పాకేస్తుంది.పైగా జలుబు వచ్చిందంటే దానితో పాటు దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి, గొంతు వాపు, అలసట, నీరసం, తల నొప్పి వంటి సమస్యలను కూడా మోసుకు వస్తుంది.
అందువల్లనే, జలుబు వచ్చాక బాద పడటం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మేలంటున్నారు నిపుణులు.మరి అందుకోసం ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా ఈ సీజన్లో కావాలని కొందరు, పొరపాటున కొందరు వర్షాల్లో తడుస్తుంటారు.అయితే వర్షంలో తడిచిన తర్వాత ఖచ్చితంగా గోరు వెచ్చని నీటితో స్నానం చేసేయాలి.
లేదంటే వాతావరణంలో ఉండే వైరస్లు శరీరంపై పేరుకుపోతాయి.దాంతో జలుబు, దగ్గు మరియు ఇతర వ్యాధులకు గురవుతారు.
చాలా మంది చేసే పొరపాటు వర్షాకాలమే కదా అని వాటర్ తాగడం మానేస్తుంటారు.కానీ, శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటేనే వైరస్లు ఎటాక్ చేయకుండా ఉంటాయి.అందుకే శరీరానికి సరిపడా నీటిని తీసుకోవాలి.అందులోనూ ఈ సీజన్లో కాచి చల్లార్చిన నీటిని తాగితేజలుబు దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.
అలాగే వేడి వేడి సూప్స్ తీసుకోవాలి.డైట్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను చేర్చుకోవాలి.మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను మానుకోవాలి.ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.బయట తయారు చేసే ఫుడ్స్‌ను ఎవైడ్ చేయాలి.వారంలో రెండు, మూడు సార్లు ఆవిరి పట్టాలి.
రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాలి.ఇంట్లోకి ఫ్రెష్ ఎయిర్ వచ్చేలా చూసుకోవాలి.
మరియు తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంటాలి.తద్వారా జలుబుతో పాటుగా ఇతర అంటు వ్యాధులకు కూడా దూరంగా ఉండొచ్చు.