చెరువులో నీళ్లు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే, కప్పలు వచ్చి ఈతకొడదామా అన్నట్లుగా ఉంది ఏపీ రాజకీయ నేతల వ్యవహారం.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన ప్రణాళికను ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో గెలవాలనుకోవడం ఆనవాయితీ.
అలాగే తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని ప్రచారం చేస్తేనే కదా ఆ ప్రభుత్వం పై నమ్మకం ఏర్పడుతుంది.ఇదే పనిని వైసీపీ చేస్తుంటే కడుపుబ్బరంగా ఉన్న టీడీపీ అడుగడుగునా అడ్డుతగులుతున్నారట.
ఇక తాజాగా ఏపీ సీఎం జగన్ రెండేళ్ల పాలనపై వైసీపీ పుస్తకం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.దీని పై టీడీపీ నేత ఆలపాటి రాజా వ్యంగ్యం ప్రదర్శించారు.
ప్రజలకు వైసీపీ చేసిన సంక్షేమం కంటే జరిగిన దోపిడీ పదింతలని, ఆస్తులు అమ్మడం, అప్పు చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదని ఎద్దేవా చేశారు.ఇక ప్రజలకు చేసిన రవ్వంత అభివృద్ధికే పుస్తకం వేసుకుంటే, దోచుకున్న దానికి గ్రంథాలు విడుదల చేయాలేమో అని వ్యాఖ్యానించారు.