టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని జక్కన్న చూస్తున్నాడు.
ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను ముందుగా అనౌన్స్ చేసినట్లుగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్ విషయంలో ఖచ్చితంగా మార్పు ఉంటుందనే వార్త జోరుగా వినిపించింది.
అయితే ఈ సినిమా నుండి తారక్ పుట్టినరోజు కానుకగా వచ్చిన పోస్టర్‌లో ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ ఇస్తారని అందరూ అనుకున్నారు.కానీ కేవలం కొమురం భీం పాత్రకు సంబంధించి సరికొత్త పోస్టర్‌ను మాత్రమే రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ముందు అనుకున్న తేదీకే ఫిక్స్ అయినట్లు కన్ఫం అయ్యింది.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి కేవలం కొంతమేర మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం, ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు మిగిలి ఉండటంతో, ఈ సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ అనుకున్నట్లు కుదిరితే, ఈ సినిమా మిగతా పార్ట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమా నిజంగానే దసరా కానుకగా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.