భారత్ లో తొలి సినిమా 1913లో విడుదల అయ్యింది.ఈ సినిమా పేరు రాజా హరిశ్చంద్ర.
ఇందులో హీరోయిన్ కోసం దర్శకుడు చాలా కష్టపడ్డాడు.కానీ ఎవరూ ముందుకు రాలేదు.
చివరకు హీరోగా చేసిన వ్యక్తి.హీరోయిన్ గా కూడా నటించాడు.
అలాంటి స్థాయి నుంచి ప్రస్తుత స్థాయికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.ఇప్పటికీ అమ్మాయిలను సినిమాల్లోకి పంపాలంటే చాలా మంది ఇబ్బంది పడుతారు.
కానీ అప్పట్లోనే చాలా మంది మహిళలు డేర్ చేసి సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.సినిమా రంగం రూపు రేఖలు మార్చడానికి ఎంతో ప్రయత్నించారు.
24 క్రాఫ్ట్స్ లో మహిళలు సత్తా చాటారు.ఇంతకీ ఇండియన్ సినిమా ముఖచిత్రం మారడానికి కారణమైన మహిళా మణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
దుర్గాబాయి కామ
ఈమె భారతీయ సినిమా పరిశ్రమలోనే తొలి మహిళా నటీమణి.
ఫాతిమా బేగం
తొలి మహిళా దర్శకురాలు.నిర్మాత, రచయిత్రి కూడా.
జడ్డన్ బాయి
ఈమె తొలి మహిళా సంగీత దర్శకురాలు
ఫెర్లెస్ నదియా
భారత సినిమా రంగంలో తొలి మహిళా స్టంట్ మాస్టర్
విజయ
ఈమె తొలి మహిళా డీఒపీగా పని చేశారు.
నర్గీస్
జాతీయ అవార్డు పొందిన తొలి హీరోయిన్ గా ఈమె గుర్తింపు పొందారు.
సరోజ్ ఖాన్
దేశ సినిమా రంగంలో తొలి మహిళా కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించారు.
ఉమా దేవి
తొలి మహిళా కమెడియన్ గా ఈమె ప్రఖ్యాతిగాంచారు.
కమలా బాయి గోఖలే
తొలి బాల నటిగా ఈమె గుర్తింపు పొందారు
అంజలీ శుక్లా
సినిమాటోగ్రఫీలో జాతీయ అవార్డు పొందిన మహిళగా గుర్తింపు పొందారు.
రాజ కుమారి
తొలి ప్లే బ్యాక్ సింగర్ గా గుర్తింపు పొందారు.
దేవికా రాణి
ఇండియన్ వెండితెరపై ముద్దు సీన్ లో నటించిన తారగా ఈమె పేరు సంపాదించింది.