తాజాగా కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల యాజమాన్యానికి సంబంధించి సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.యజమాని మరణించిన అనంతరం వాహన యాజమాన్య హక్కులు అన్నీకూడా బదిలీకి నామిని ఎంచుకునే విధంగా మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేసి వినియోగదారుల ముందుకు తీసుకొని వచ్చింది రవాణా శాఖ.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.మోటార్ వాహనాల నిబంధనలు -1989′ చట్టంలో కీలక మార్పులు చేపట్టి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
ఈ క్రమంలో వాహన యజమానులు నామిని ఎంచుకునే విధంగా సౌకర్యాలను ప్రవేశపెట్టింది.ఈ సవరణతో యజమాని ఏదైనా కారణం వల్ల మృతి చెందితే ఆ వాహన రిజిస్ట్రేషన్ నామినీకి బదలాయింపు వెసలుబాటు కల్పించబోతుంది.
ఇందుకొరకు వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే నేరుగా నామిని పేరును కూడా నమోదు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది.అలాగే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అనంతరం కూడా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నామిని కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇందు కొరకు నామినీ కి సంబంధించిన పూర్తి పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.అయితే ఈ నామినీ ప్రక్రియ అనేది దేశవ్యాప్తంగా వేరువేరుగా ఉంటుందని రాష్ట్ర రవాణా మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
![Telugu Central, Key, Vehicle, Nominee, Regisatratin-Latest News - Telugu Telugu Central, Key, Vehicle, Nominee, Regisatratin-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2021/05/central-government-made-key-changes-in-the-motor-vehicle-act.jpg )
ఇక సవరణలో భాగంగా ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే.యజమాని మృతి చెందిన అనంతరం నామినీ కి హక్కులు బదలాయింపు ప్రక్రియ కనీసం మూడు నెలల సమయం పట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.అలాగే యజమాని మృతి చెందిన 30 రోజులలో గడువులోపే నామినీ కి సంబంధించిన ఆధారాలను రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలతో సంప్రదించవలసిగా పేర్కొంది.అలాగే విడాకులు, ఆస్తి పంపకాలు లాంటి కారణాలతో వాహన యజమాని మార్చుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ఆ చట్ట సవరణలో పేర్కొంది.
అలాగే యజమానులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)ను అంగీకరించి నామినీ మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.