దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.భయంకరంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.
దీంతో కరోనా బారిన పడిన రోగులు బెడ్లు అందక ఆక్సిజన్ కొరతతో సకాలంలో వైద్యం దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో మహమ్మారిని కట్టడి చేయటానికి అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, దేవాలయాలు, మసీదులు.మతపరమైన ప్రదేశాలను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
ఆక్సిజన్ కొరకు అదేవిధంగా లాక్ డౌన్.దేశంలో అమలవుతున్న కరోనా నిబంధనలపై.సుప్రీం కేంద్రాన్ని ఆరా తీసింది.అదేవిధంగా స్మశాన వాటిక సిబ్బందికి వ్యాక్సినేషన్ విషయంలో ఏం చేశారు అని ప్రశ్నించింది.
అదేవిధంగా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ విషయంలో .నిరక్షరాస్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించడం జరిగింది.వారికి ఇంటర్నెట్ వాడే విధానం తెలియదు కదా అని కేంద్ర ప్రభుత్వంపై అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది.అదేవిధంగా వ్యాక్సిన్ ధరల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించింది.
ప్రజలు తమ సమస్యలు సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్న నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని గట్టిగా హెచ్చరించింది సుప్రీంకోర్టు.
.