ఏపీలోని మూడు జిల్లాలలో రీ పోలింగ్.. వెల్లడించిన ఎస్ఈసీ నీలం సాహ్ని.. !

ఎన్నికలు అనగానే నాయకులు వేసే ఎత్తులు ఎలాగ ఉంటాయో అందరికి తెలిసిందే.తాము మాత్రమే గెలవాలి, తమ పార్టీ మాత్రమే అధికారంలోకి రావాలని ఎవరి కంట పడకుండా చాటుగా చేస్తున్న అవినీతి గురించి చెప్పుకుంటూ వెళ్లితే ఒకటి రెండు రోజుల్లో తెగిపోదు.

 Re-polling In Three Districts In Ap Sec Neelam Sahni Revealed Ap, Re Polling, Th-TeluguStop.com

ఓటర్లను మభ్యపెట్టడానికి ఖర్చుకు వెనకాడని పార్టీలు నేడు సమాజంలో తయారు అయ్యాయి.అలాగే ఎన్ని గొడవలు సృష్టించి అయినా మెజారిటీ సాధించాలనుకునే నేతలున్న రాజకీయం ప్రస్తుతం కలుషితం అయ్యిందని చెప్పవచ్చూ.

ఇకపోతే ఏపీలోని మూడు జిల్లాలలో రీ పోలింగ్ నిర్వహిస్తున్నట్లుగా ఎస్ఈసీ నీలం సాహ్ని వెల్లడించారు.పూర్తి వివరాలు తెలుసుకుంటే.ఆంధ్రప్రదేశ్ లో 3 జిల్లాల పరిధిలో రీ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుపుతున్న ఎస్ఈసీ నీలం సాహ్ని, ఆ ప్రాంతాలను వెల్లడించారు.

ఇక నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం పొనుగుపాడు, విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేట, పణుకుపేటలోని 3 పోలింగ్ కేంద్రాలు, పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మొదలైన ఈ ప్రాంతాల్లో నేడు రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు.

ఇకపోతే గుంటూరు జిల్లా ఉయ్యందనలో జరిగిన రిగ్గింగ్‌పై కలెక్టర్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube