మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ నటవారసుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి అల్లు అర్జున్.మొదటి సినిమా గంగోత్రి నుంచి ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ వరకు బన్నీ కెరియర్ లో ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ వస్తున్నాడు.
సినిమా సినిమాకి క్యారెక్టర్స్ పరంగా వేరియేషన్స్ చూపిస్తూ అలాగే స్టైల్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు.మొదటి సినిమాలో అల్లు అర్జున్ ని చూసి వీడు హీరో ఏంటి అన్నవారే ప్రస్తుతం అతన్ని స్టైలిష్ స్టార్ అంటున్నారంటే ఇన్నేళ్ళ కెరియర్ లో తనని తాను ఎంతగా మార్చుకున్నాడో అర్ధమవుతుంది.
ప్రెజెంట్ యూత్ కూడా స్టైల్స్ విషయంలో ఎక్కువగా అల్లు అర్జున్ ని ఫాలో అవుతూ ఉంటారు.కమర్షియల్ సినిమాలు చేసిన కొత్తదనం చూపించడం అల్లు అర్జున్ స్టైల్ అని చెప్పాలి.
ఈ కారణంగానే అతనికి మలయాళం, హిందీ ఇండస్ట్రీలో కూడా అభిమానులు ఉన్నారు.అతని సినిమాలన్నీ ఈ రెండు బాషలలో రిలీజ్ అవుతూ అక్కడి ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి.
అయితే పుష్ప సినిమాతో దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చేశాడు.ఇకపై అందరూ బన్నీని ఐకాన్ స్టార్ అని పిలవాలని కూడా పుష్ప టీజర్ రిలీజ్ సందర్భంగా చెప్పడం విశేషం.
ఇక ఐకాన్ స్టార్ అనేది తనకు మరింత గౌరవం, బాద్యత పెంచేస్తుందని అల్లు అర్జున్ కూడా చెప్పుకు రావడం ద్వారా ఆ బ్రాండ్ నేమ్ కి సార్ధకత చేసుకోవాలనే గట్టి నిశ్చయంతో బన్నీ ఉన్నాడని తెలుస్తుంది.పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇకపై అతను చేయబోయే అన్ని సినిమాలు యూనివర్శల్ కాన్సెప్ట్స్ తో ఉండే విధంగా చూసుకుంటున్నాడు.అలాగే యూత్ ఐకాన్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ ఐకాన్ స్టార్ అనే బిరుదుని పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఐకాన్ అనే బ్రాండ్ ని కొనసాగించాలంటే బన్నీకి కూడా ఇండియన్ వైడ్ గా ఆ రేంజ్ లోనే హిట్స్ పడాల్సిన అవసరం కూడా ఉంది.ఐకాన్ స్టార్ అనే బిరుదుని బన్నీ స్వీకరించడానికి కారణం ఇదే అయితే దానిని ఎంత వరకు నిలుపుకుంటాడు అనేది ఇప్పుడు అందరూ ఎదురుచూసే అంశం.