కాబోయే భర్త మీద ఆరోపణలు రావడంతో పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్

సెలబ్రిటీ వివాహాలు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండవనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.పెళ్లికి ముందు డేటింగ్, రిలేషన్ అంటూ తిరిగే సెలబ్రిటీలు తరువాత వారినే పెళ్లి చేసుకుంటారనే గ్యారెంటీ ఉండదు.

 Hindi Medium Actor Saba Qamar Calls Off Wedding, Bollywood, Pakistan, Indian Cin-TeluguStop.com

వారి పెళ్లి సమయం వచ్చేసరికి చేసుకునే వాళ్ళు మారిపోతారు.అయితే కొంత మంది సెలబ్రిటీల జీవితాలలో ప్రేమ, పెళ్లి అనేవి చాలా ప్రభావితం చేస్తాయి.

వారి వ్యక్తిగత జీవితంలో చేసుకోబోయే వ్యక్తి ఎంతో కొంత నైతికత కలిగి ఉండాలని అనుకుంటారు.అయితే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ముఖ్యంగా అమ్మాయిలు ఈ జెనరేషన్ లో కొద్దిగా ఇండిపెండెంట్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

చేసుకోబోయేవాడు సరైనవాడు కాదని తెలిస్తే పెళ్లి పీటల మీద నుంచి కూడా లేచి వెళ్ళిపోయి వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు.కొంత మంది నిశ్చితార్ధం అయ్యాక పెళ్లి వద్దనుకుంటున్నారు.

ఇప్పుడు పాకిస్తాన్ కి చెందిన బాలీవుడ్ నటి సబా కమర్ కూడా తన పెళ్లి విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకుంది.

త్వరలో తానూ పెల్లాదబోతున్న అజీమ్ ఖాన్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సబా అతనితో పెళ్లికి క్యాన్సిల్ చేసుకుంది.

ఇప్పటికే వారిద్దరికి నిశ్చితార్ధం అయినా కూడా పెళ్లి వద్దనుకుంది.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.హాయ్… ముఖ్య‌మైన ప్ర‌క‌ట‌న చేయాల‌నుకుంటున్నా.వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల నేను అజీమ్ ఖాన్‌తో పెండ్లిని ర‌ద్దు చేసుకుంటున్నా.

మేం పెండ్లి చేసుకోవ‌డం లేదు.న‌న్ను ఎల్ల‌పుడూ సపోర్టుగా నిలిచే మీరు నా నిర్ణ‌యానికి మ‌ద్ద‌తుగా నిలుస్తారని ఆశిస్తున్నా.

చేధు వాస్త‌వాల‌ను తెలుసుకోవ‌డం ఆల‌స్యం కాలేద‌ని అనుకుంటున్నా.మీకొక ముఖ్య‌మైన విష‌యం చెప్పాలి.

అజీమ్‌ఖాన్ నా జీవితంలో ఎప్పుడూ క‌ల‌వ‌లేదు.ఇద్ద‌రం ఫోన్ ద్వారా మాత్ర‌మే ఒక‌రికొక‌రం క‌నెక్ట్ అయ్యాం.

ప్ర‌స్తుతం నాకు చాలా క‌ష్ట‌మైన టైం.కానీ ఈ టైం కూడా పాస్ అవుతుంది అంటూ ఆమె పోస్ట్ పెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube