ప్రకృతి లోతు తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన పని.ఎందుకంటే ప్రకృతి ఎప్పటికప్పుడు తనకు తాను రూపంతరం చెందుతుంది.
అందులో భాగంగానే మనకు ఎన్నడూ తెలియని కీటకాలు, కొత్త కొత్త రకాల పక్షులు మనం చూస్తూ ఉంటాం.ఇది వరకు ఇటువంటివి మనం ఎప్పుడు చూడలేదని మనది మనకే ఆశ్చర్యమేస్తుంది.
అయితే ఇలాంటివి ఎక్కువగా అడవులలో సంభవిస్తుంటాయి.మన దృష్టికి రావడం చాలా అరుదు అని చెప్పవచ్చు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే మనం చాలా రకాల కీటకాలను చూస్తూ ఉంటాం.కాని బంగారు రంగులో ఉండే కీటకాలను మనం ఎప్పుడు చూసి ఉండము కూడా.
ప్రస్తుతం ఇప్పుడు నెట్టింట్లో ఈ బంగారు కీటకాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సుశాంత్ నంద దీనిని షేర్ చేశారు.
అయితే నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ పెడుతూ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు.నెటిజన్లను ఫిదా చేసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.
ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.అయితే ఇటువంటి కీటకాలు అరుదుగా కనిపిస్తాయని,అచ్చం బంగారు వర్ణం పూసినట్లుగా ఉన్నాయని, పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇవి అగ్న ఆసియాలో కనిపించే గోల్డెన్ టార్టాయిస్ బీటిల్ ఇది అని తెలుస్తోంది.