కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రోజురోజుకు బలహీనంగా తయారవుతోంది.అయితే కాంగ్రెస్ లో కుమ్ములాటలతో ప్రజల్లో మరింత పలుచబడుతోంది.
అయితే త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, అయితే కాంగ్రెస్ తన సత్తాను నిరూపించుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక అవకాశం దొరికాయి.అయితే రేవంత్ రెడ్డి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావుకు ఎమ్మెల్సీ ఎన్నికలు చివరి అవకాశం అని, ఇక ఈ ఎన్నికలలో ఓడిపోతే ఇక హరీష్ రావు ఉండడని, కేసీఆర్ హరీష్ రావుకు ఈ ఎన్నికల విజయం డెడ్ లైన్ విధించాడని, టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతే ఇక హరీష్ రావు రాజకీయ జీవితం అంతమవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం రేపాయి.
రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక వ్యూహం ఏంటని చర్చించుకుంటున్నారు.అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో హరీష్ రావు ప్రచారం చేస్తున్నాడు కావున అందుకే హరీష్ ను టార్గెట్ చేసారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
మరి రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.దీనిపై ఇప్పటివరకు హరీష్ రావు స్పందించకున్నా సరైన సమయంలో బదులిస్తాడని టీఆర్ఎస్ నాయకులు తెలుపుతున్నారు.
ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.