టిడిపి యువ నాయకుడు, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయ వ్యూహాలపై చాలా చాలా సెటైర్స్ పేలుతూనే ఉన్నాయి.పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయాడు.
ప్రత్యక్ష రాజకీయాలు ఆయనకు కలిసి రావడం లేదని, అందుకే ఆయన రాజకీయమంతా సోషల్ మీడియా ద్వారానే చేస్తూ, ఆయన ట్విట్టర్ పక్షి గా మారిపోయాడు అంటూ సెటైర్లు వినిపిస్తున్నా, లోకేష్ తన పద్దతి మార్చుకోవడం లేదు.నిత్యం ట్విట్టర్ ద్వారా రాజకీయం చేస్తూ, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, జనాల్లోకి ఆ కామెంట్స్ చొచ్చుకు వెళ్లే విధంగా చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాడు.
వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపిస్తూ, ట్విట్టర్ వార్ కొనసాగిస్తున్నారు.మొదట్లో ఆయన చేస్తున్న ట్వీట్స్ జనాల్లోకి వెళ్లకపోయినా ,కొద్ది రోజులుగా లోకేష్ చేస్తున్న ట్విట్టర్ కామెంట్స్ మంత్రం జనాల్లో వైరల్ అవుతున్నాయి.
నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూనే , వైసీపీని నవ్వులపాలు చేసే విషయంలో కాస్త సక్సెస్ అవుతున్నారు.ప్రభుత్వం ఎంత పకడ్బందీగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నా, లోపాలను వెతికి పట్టుకొని వైసిపి క్రెడిట్ దక్కకుండా చేయడంలోనూ పై చేయి సాధిస్తున్నారు.
తాజాగా అమరావతి పోరాటానికి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన జనభేరి బహిరంగ సభ లో బాబు వైసీపీ పై ఘాటు విమర్శలు చేశారు.ఆ వ్యాఖ్యలతో వైసీపీ మంత్రులు సైతం ఘాటు విమర్శలతో విరుచుకుపడిన తీరుపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
దీంతో లోకేష్ ట్విట్టర్ ద్వారా వైసీపీ పై విమర్శలు చేశారు.
జన భేరి సభ సక్సెస్ తో జగన్ రెడ్డి కి మబ్బులు విడిపోయాయి అని, అనేక ప్రాంతాల ప్రజలు, పార్టీలు ఒకే రాష్ట్రం , ఒకే అమరావతి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం లోకేష్ ప్రత్యక్షంగా ఏపీలో అడుగు పెట్టేందుకు, నిత్యం ఏపీలో నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కరోనా భయం కానీ, మరో భయం కానీ ఉన్నా ఏదో రకంగా వైసీపీ ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేస్తూ , జనాల్లో చర్చ జరిగే విధంగా చేయడంలో ఆయన సక్సెస్ అవుతూనే వస్తున్నారు.కాకపోతే ప్రత్యక్షంగా నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉంటే కలిగే ప్రయోజనం మరింత ఎక్కువగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.