సరిగ్గా రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాని పిల్లలకు అప్పుడప్పుడే మాట్లాడటం నేర్చుకుంటారు.కానీ ఇక్కడ మాత్రం ఓ బుడ్డోడు ఏకంగా వివిధ దేశాల జాతీయ పతాకాల పేర్లు మాత్రం చకచక చెప్పేస్తున్నాడు.
సరిగ్గా ఏ బి సి డి లు కూడా రాని వయసులో ఏకంగా జాతీయ పతాకాలను చెప్పి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.ఇంత చిన్న మెదడులో అంత జ్ఞాపకశక్తిని కలిగి ఉండి కేవలం రెండు సంవత్సరాల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే….
విజయవాడలో అయ్యప్ప నగర్ లో నివాసం ఉంటున్న మురళీకృష్ణ, శిరీష దంపతులకు రెండు సంవత్సరాల వయసు కలిగిన అక్షిత్ అనే ఒక కుమారుడు ఉన్నాడు.
మురళి కృష్ణ ఉద్యోగరీత్యా బ్యాంక్ మేనేజర్, తల్లి గృహిణి.అయితే వీరి కొడుకు అక్షిత్ కు 20 నెలలు మాత్రమే ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న అక్షిత్, తనకు జ్ఞాపక శక్తి మాత్రం ఎంతో అద్భుతం అని నిరూపించుకున్నాడు.
ఏ విషయమైన ఒక్కసారి చూస్తే చాలు ఇట్టే గుర్తుపట్టే స్తున్నాడు.
సాధారణంగా రసాయన సమీకరణాలు నేర్చుకోవాలంటే ఎంతో కుస్తీ పడాల్సి ఉంటుంది.కానీ ఈ బుడతడు మాత్రం ఎంతో అలవోకగా రసాయన సమీకరణాలు చెప్పి అందరిని అబ్బుర పరిచాడు.ఏదైనా చిత్రాలను, ప్రముఖ వ్యక్తులను ఒక్కసారి చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తాడు.
ఇంత చిన్న వయసులోనే ఇంత జ్ఞాపకశక్తిని కలిగి అక్షిత్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు.ఈ సందర్భంగా తన తల్లిదండ్రులు మాట్లాడుతూ ఏడాదిన్నర వయసులోనే తన ప్రతిభను గుర్తించామని, తన ప్రతిభకు మరింత శిక్షణ ఇచ్చి తనని మెరుగు పరిచినట్లు వారు తెలియజేశారు.
ఈ సందర్భంగా భవిష్యత్తులో తన కొడుకు ఒక గొప్ప శాస్త్రవేత్త కావాలని తన తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లు తెలియజేశారు.