చిన్ననాటి హీరో పాత్రలో అలరించిన హీరోల కొడుకులు వీళ్ళే!

మాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఓ ట్రండ్ కంటిన్యూ అవుతుంది.సినిమా బ్యాక్ డ్రాప్ లో లేదంటే స్టాటింగ్ లో హీరో చిన్న‌నాటి క్యార‌క్ట‌ర్ లో హీరోలే త‌మ పిల్ల‌ల్ని అభిమానుల‌కు ప‌రిచ‌యం చేస్తారు.

 Ghattamaneni Mahesh Babu, Tollywood, Sudheer Babu, Raviteja, Raja The Great, Sud-TeluguStop.com

అలా ప‌రిచ‌యం చేసి వాళ్ల‌నే హీరోలను చేస్తారు.ఎన్టీఆర్, బాల‌కృష్ణ‌, రామ్ చ‌ర‌ణ్, అక్కినేని అఖిల్, మ‌హేష్ బాబు ఇలా టాలీవుడ్ అగ్ర‌హీరోలంద‌రూ త‌మ తండ్రులు హీరోలుగా యాక్ట్ చేస్తే.

ఆ సినిమాల్లో వారి చిన్న నాటి క్యార‌క్టర్ లో యాక్ట్ చేసిన వారే.నాటి నుంచి నేటి వ‌ర‌కు ఆ ఫార్ములా కొన‌సాగుతూనే ఉంది.

తాజాగా తమ‌ చిన్న‌నాటి క్యార‌క్ట‌ర్ల‌లో త‌మ పిల్ల‌ల్ని ప‌రిచ‌యం చేసిన హీరోలు చాలా మంది ఉన్నారు.అలా యాక్ట్ చేసిన హీరోల పిల్ల‌లే ఆ పాత్ర‌ల‌కు ప్రాణం పోసి అంద‌ర్ని మెప్పించారు.

నాటి త‌రం హీరోల్లో సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న కొడుకు మ‌హేష్ బాబును చిన్నప్ప‌టి క్యారక్ట‌ర్ లో యాక్ట్ చేయించి మెప్పించారు.ఇప్పుడు మ‌హేష్ బాబు సైతం త‌న కొడుకును గౌత‌మ్ కృష్ణ ను త‌న చిన్న నాటి క్యార‌క్టర్ ను సుకుమార్, మహేష్ బాబు మొదటి కాంబో మూవీ వన్ నేనొక్కడినే లో ప‌రిచ‌యం చేశారు.

అదే ఘ‌ట్ట‌మ‌నేని వంశం నుంచి హీరో సుధీర్ బాబు అతడు నటించిన మోసగాళ్ళకు మోసగాడు లో అతడి చిన్నప్పటి పాత్రను అతడి కొడుకైన చరిత్ మానస్ తో యాక్ట్ చేయించాడు.

Telugu Raja, Raviteja, Sudheer Babu, Tollywood-Movie

మాస్ మహారాజ ర‌వితేజ సైతం రాజా ది గ్రేట్ లో రవితేజ చిన్నతనంలోని కేరక్టర్ ను అతడి కొడుకు మహాధన్ తో చేయించారు.ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో మ‌న‌కు తెలిసింది.ఇక టాలీవుడ్ తో పాటు మాలీవుడ్ లో సైతం హీరోల కొడుకుల హ‌వా కొన‌సాగుతుంది.

మోహన్ లాల్ తో పాటు ప‌లువురు అగ్ర‌హీరోలు వారి పిల్ల‌ల్ని సైతం త‌మ చిన్ననాటి క్యారక్ట‌ర్ ల‌లో అవ‌కాశం క‌ల్పించారు.ఆ చిన్న‌నాటి హీరోల క్యారక్ట‌ర్ల పిల్ల‌లే ఇప్పుడు సినిమా ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube