మూడు నెలలే అంటోన్న తేజు

మెగా కాంపౌండ్ నుండి వచ్చి సుప్రీం హీరోగా మారిన సాయి ధరమ్ తేజ్ కెరీర్ తొలినాళ్లలో వరుసబెట్టి సినిమాలు చేస్తూ విజయాలను అందుకున్నాడు.ఆ తరువాత కొన్ని ఫెయిల్యూర్ చిత్రాలను ఎంపిక చేసుకుని ట్రాక్ తప్పాడు.

 Sai Dharam Tej Gives Only 3 Months Duration, Sai Dharam Tej, Solo Brathuke So Be-TeluguStop.com

అయితే తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు తేజు చాలా కష్టపడాల్సి వచ్చింది.దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇక తేజు నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా కరోనా వైరస్ కారణంగా అది కుదర్లేదు.

దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే దర్శకుడు దేవా కట్టాతో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ఓకే చేశాడు తేజు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ఫుల్ స్పీడుగా కొనసాగుతున్నాయి.

అయితే ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తేజు చూస్తున్నాడు.

అందుకోసం పక్కా ప్రణాళికతో ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకోవాలని ఆయన చూస్తున్నాడు.కాగా ఈ సినిమా కోసం ఆయన 3 నెలల సమయాన్ని మాత్రమే దర్శకుడి ముందు ఉంచాడు.

మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని ఆయన చిత్ర యూనిట్‌కు సూచించాడట.దీంతో వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించి, పూర్తి చేయాలని దేవా కట్టా ప్రయత్నిస్తున్నాడు.

ఇక పూర్తి పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube