లావణ్య త్రిపాఠి.అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి వావ్ అనేలా నటించి అందరి మనసు దోచేసింది ఈ భామ.
ఆ సినిమాలో ఎంతో అమాయకంగా కనిపించే ఈ అమ్మడు ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాల్లో కూడా సాఫ్ట్ రోల్ ఉండే సినిమాల్లోనే ఎక్కువ నటించింది.హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా లావణ్య త్రిపాఠి నిలిచింది.
అయితే నిజానికి.అందాల రాక్షసి వంటి సినిమాలో ఎంతో క్యూట్ గా అందంగా కనిపించిన ఈ భామకు పెద్దగా సక్సెస్ రేటు లేదు.
ఏ సినిమా తీసిన ప్లాప్ ఏ అవుతూ వస్తుంది.అయితే కొన్ని బ్లాక్ బస్టర్ లు మాత్రం ఆమె చేతిలో ఉన్నాయ్.
మంచు విష్ణుతో దూసుకెళ్తా, నానితో భలె భలె మగాడివోయ్, నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయ్.
ఇక ఆతర్వాత మధ్యలో తీసిన సినిమాలు అన్ని ప్లాప్ అయినప్పటికి నిఖిల్ తో తీసిన అర్జున్ సురవరం చిత్రం మంచి హిట్ కొట్టింది.
దీంతో ఈ అందాల రాక్షసి మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో చిక్కుకుపోయిన లావణ్య త్రిపాఠి లాక్ డౌన్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది.
ఇంటి ఫుడ్ బాగా వంటబట్టడంతో కాస్త బొద్దుగా తయారయినట్టుంది.అందుకే తెగ వర్కౌట్లు చేస్తుంది.
అయితే ఈ నేపథ్యంలోనే మీడియాపై ఆమె కాస్త ఫైర్ అయ్యారు.కాదు కాదు సెటైర్లు వేశారు.
లావుగా ఉన్నారని.శరీరంపై కించపరిచేలా వ్యాఖ్యలు చెయ్యడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు చుట్టూ ఉన్నవారిని సంతోషపెట్టాలి అని మీడియా చెప్తుంది.
అదే మీడియా మళ్లీ. ఆ హీరో, హీరోయిన్లు చబ్బీగా ఉన్నారు.
వెయిట్ తగ్గారు.అందాన్ని కోల్పోయారు.
అప్పుడు ఉన్నంత క్యూట్ నెస్ ఇప్పుడు వారిలో లేదు అంటూ రాస్తుంది.మనం అందరిని ఒకేలా చూడాలి.
ఎవరు తప్పు చేసిన తప్పే అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు లావణ్య త్రిపాఠి.దీంతో ఇన్నాళ్లు సైలెంట్ గా క్యూట్ గా కనిపించే ఈ అమ్మాయ్ ఏంటి ఇలా తయారయ్యింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు!
.