కొత్తిమీర ను కేవలం సువాసన కోసం, అలంకరణ కోసం కూరలలో ఉపయోగిస్తామని చాలామంది భావిస్తారు.అంతేకాదు కొంతమంది ఈ కొత్తిమీర కూరలో వేసినా, వేయకపోయినా ఎలాంటి ప్రయోజనం లేదని కూడా భావిస్తుంటారు.
కానీ, కొత్తిమీరని ఆహారంలో నిత్యం తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఎంత మేలు చేకూరుతుందో చాలామందికి తెలియదు.కొత్తిమీర తీసుకోవడం ద్వారా కేవలం రుచి, సువాసన మాత్రమే కాకుండా వాటి ద్వారా అనేక రకాల యాంటి ఆక్సిడెంట్స్ మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి.
వీటి ద్వారా లభించే పోషకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతేకాదు ఈ కొత్తిమీర జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇంకా ఈ కొత్తిమీర లో ఉండే డోడిసేనల్ అనే పదార్థం ద్వారా పేగుల్లో ఏర్పడే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ లాంటి వాటిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.వీటితో పాటు మరి కొన్ని ప్రయోజనాలు ఎలా చేకూరుతాయో ఒకసారి చూద్దామా…
ఈ కొత్తిమీర ముఖ్యంగా ఆడవారిలో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం జరిగే వారికి కొత్తిమీర కషాయాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే ఆ సమస్య చాలా బాగా నియంత్రణలో ఉంటుంది.
ఇక ఒక గ్లాసు మజ్జిగలో కాస్త కొత్తిమీర రసం, కొద్దిగా జీలకర్ర కలిపి తాగితే మనకు విటమిన్ A, విటమిన్ బి 1, విటమిన్ బి2, విటమిన్ C, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.ఇవి మన శరీరం లోని ఎముకల దృఢత్వానికి, చర్మ సంరక్షణ చేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
అలాగే గర్భిణీలు రోజు రెండు లేదా మూడు చెంచాల కొత్తిమీర రసం నిమ్మరసం తో కలిపి తీసుకుంటే కడుపులో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పూర్తిగా నయం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
ఇక నోటి దుర్వాసన చిగుళ్ల సమస్యలు ఉన్నవారు కొత్తిమీర ఆకులను నమిలి మింగడం ద్వారా ఆ సమస్యలకు తొందరగా ఒక చక్కటి పరిష్కారం దొరుకుతుంది.ఎవరికైనా కామెర్లు సంభవించినప్పుడు ఈ కొత్తిమీర రసాన్ని సేవిస్తే చాలావరకు మేలు చేకూరుతుంది.అలాగే అజీర్ణంతో బాధపడే వారు కూడా కొత్తిమీర రసంలో నిమ్మరసం జీలకర్ర కాస్త ఉప్పు కలుపుకుని తీసుకుంటే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.
అలాగే గ్యాస్ వల్ల వచ్చే మంట ను పోగొట్టాలంటే పెరుగులో కాస్త కొత్తిమీర రసం కలుపుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగితే ఆ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.ఈ కొత్తిమీర రసానికి శరీరంలో ఉండే కొవ్వును తగ్గించే లక్షణాలు చాలా ఉన్నాయి.
ముఖ్యంగా కొత్తిమీర తయారుకు కారణమైన ధనియాలను కూడా ఉపయోగించడం ద్వారా అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు.అజీర్తి సమస్య ఉన్నవారు ధనియాలను రసం మాదిరి కాచి అన్నంలో కలుపుకుని తినడం ద్వారా అజీర్తి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.