దేశంలో అన్ లాక్-4 ప్రక్రియ ప్రారంభమైంది.దీంతో కేంద్ర ప్రభుత్వం నగరాల్లో మెట్రో ప్రయాణాలకు ఓకే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో పరుగులు తీస్తోంది.మెట్రో స్టేషన్ లో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు సాగిస్తున్నారు.
మెట్రోలో ప్రయాణించే వాళ్లు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవడానికి ప్రతి స్టేషన్ లో శానిటైజర్ స్టాండ్లను ఏర్పాటు చేసింది.మెట్రో ప్రయాణికుల మధ్య దూరం ఉండేలా ప్రత్యేకంగా మార్కింగ్ ను ఏర్పాటు చేసింది.
మెట్రో కంపార్ట్ మెంట్ లో అధికశాతం ఆక్సిజన్ ఉండేలా చర్యలు తీసుకుంటోంది.దీంతో పాటు మెట్రో స్టేషన్ లో విధులు నిర్వహించే వారు షిప్టుల వారీగా పనులు చేస్తున్నారు.
తాజాగా ఢిల్లీ మెట్రో కొన్ని సేవలను తిరిగి ప్రారంభించింది.గురువారం గ్రీన్, రెడ్, వాయ్ లెట్ లైన్లలో మెట్రో ప్రయాణాలు సాగించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.గ్రీన్ లైన్ లో భాగంగా కీర్తినగర్ నుంచి ఇందర్ లోక్, రెడ్ లైన్ లో భాగంగా ద్వారకా, వైశాలిని నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ, రితాలా-షాహీద్ స్టాల్ వరకు, వాయ్ లెట్ లైన్ లో భాగంగా కాశ్మీర్ గేట్ నుంచి నహర్ సింగ్ మధ్యలో రాకపోకలు సాగించనుంది.ఈ సర్వీసులు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు నడుస్తాయని ఢిల్లీ మెట్రో సంస్థ పేర్కొంది.