కరోనా కారణంగా ఆలస్యం అయిన ఐపీఎల్ ఈ ఏడాది సీజన్ ను యూఏఈలో నిర్వహించబోతున్నారు.వచ్చే నెల 19 నుండి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్‌కు స్పాన్సర్ కొరత ఏర్పడినది.
గత సీజన్ వరకు వివో స్పాన్సర్‌గా కొనసాగిన విషయం తెల్సిందే.భారత్ చైనాల మద్య నెలకొన్న సమస్య కారణంగా వివో తప్పుకుంది.
వివో కంపెనీ చైనాకు చెందిన కంపెనీ అనే విషయం తెల్సిందే.అందువల్ల ఈమద్య కాలంలో ఇండియాలో వివోకు కష్టకాలం కొనసాగుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో స్పాన్సర్‌షిప్ కొనసాగించలేం అంటూ వెనక్కు తగ్గడంతో కొత్త స్పాన్సర్స్‌ను వెదికే పనిలో బీసీసీఐ ఉంది.ఇప్పటికే స్పాన్సర్‌షిప్ కోసం బిడ్లను ఆహ్వానించింది.
భారత్‌కు చెందిన పలు కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు కూడా బిడ్‌ను దాఖలు చేశాయి.రిలయన్స్ ఐడియా బైజూస్ వంటి భారీ సంస్థలతో పాటు పతాంజలి వారు కూడా బిడ్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ కోసం పతాంజలి భారీ మొత్తంను కోట్ చేసిందట.ఈ విషయాన్ని పతాంజలి సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు తెలియజేశారు.ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ తప్పకుండా తమ కంపెనీకు వస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశారు.త్వరలోనే ఈ బిడ్‌కు సంబంధించిన ఫలితాలు వెళ్లడి చేసే అవకాశం ఉంది.
పదుల సంఖ్యలో ఈ స్పాన్సర్‌షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.మరి పతాంజలి వారికి దక్కేనా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది.