తన కోసం మరో సారి రచయితగా మారుతున్న నాగ శౌర్య

టాలీవుడ్ లోకి అడుగుపెట్టే హీరోలు అందరూ తమని తాము కమర్షియల్ హీరోగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు.హీరోయిజం ఉండే సినిమాలు చేయాలని, యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉండాలని అనుకుంటారు.

 Naga Shaurya Once Again Write Story For Success, Tollywood, Commercial Movies, H-TeluguStop.com

అయితే అలా అనుకోని కొద్ది రోజులు కమర్షియల్ కథలు ప్రయత్నం చేసి డిజాస్టర్లు చూసిన తర్వాత తత్త్వం అర్ధం చేసుకొని తమ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథలని ఎంచుకొని సినిమాలు చేస్తారు.కమర్షియల్ మాస్ హీరో అనిపించుకోవడం అందరికి సాధ్యం అయ్యే పని కాదు.

అందుకే హీరో నితిన్, నిఖిల్ లాంటి స్టార్స్ కమర్షియల్ కథలు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి చివరికి వారికి సరిపోయే జోనర్ లో సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు.అయితే ఇప్పుడు మాస్, కమర్షియల్ హ్యాంగోవర్ లో మిల్కీ హీరో నాగ శౌర్య ఉన్నాడు.

ప్రేమ కథా చిత్రాలతో హిట్స్ కొట్టిన కూడా సరైన గుర్తింపు రావడం లేదని భావిస్తున్న ఈ యువ హీరో ఎలా అయినా కమర్షియల్ సక్సెస్ కొట్టి తనని తాను హీరోయిజం మెటీరియల్ అనిపించుకోవాలని అనుకుంటున్నాడు.దాని కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

తాజాగా అశ్వద్ధామ సినిమాతో కమర్షియల్ హీరోగా యాక్షన్ చేశాడు.అయితే కంటెంట్ బాగున్నా కూడా అనవసరమైన ఎక్స్ ట్రా సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్ రిజక్ట్ చేశాడు.

ఆ సినిమా కోసం శౌర్య రచయితగా కూడా మారి తానే కథ రాసుకున్నాడు.ఇప్పుడు మరో సారి తనకోసం మంచి కమర్షియల్ సబ్జెక్టుని సిద్ధం చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం అతని చేతిలో గీతా ఆర్ట్స్ బ్యానర్ తో పాటు, సుకుమార్ బ్యానర్ లో ఒక సినిమా ఉంది.అయితే తాను కోరుకునే సినిమా కోసం తన ప్రొడక్షన్ లో ఈ కమర్షియల్ కథతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

త్వరలో దీనిని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube