టాలీవడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి ప్రగతి.తల్లి, అక్క, అత్త పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న ఈమె సుమారుగా స్టార్ హీరోలు అందరితో జత కట్టింది.
అయితే ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలలో తల్లి పాత్రలకి కూడా ఒకప్పటి హీరోయిన్స్ ని తీసుకోవడంతో పాటు లుక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.పెర్ఫెక్ట్ బాడీ షేప్ తో ఉన్నవారికి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.
ఈ నేపధ్యంలో నటి ప్రగతి కూడా తన, లుక్స్ మార్చుకోవడానికి ఫిట్ నెస్ మంత్ర జపిస్తుంది.ఎలాగూ ప్రస్తుతానికి లాక్ కరోనా కారణంగా షూటింగ్ లు లేకపోప్వడంతో ఇంటి దగ్గర ఉండటం ఈమెకి బాగా కలిసొచ్చింది.
దీంతో జిమ్ లో విపరీతంగా కసరత్తులు చేస్తుంది.
అదే సమయంలో పిల్లలతో కలిసి హాట్ హాట్ గా డాన్సులు చేస్తూ ఆ వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.తాజాగా కొడుకుతో కలిసి ఈమె వర్క్ అవుట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇది విపరీతంగా వైరల్ అవుతుంది.ఈ వయసులో కూడా ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ఈమెతో పాటు మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూడా హాట్ హాట్ గా తన కూతురుతో కలిసి డాన్స్లు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంది.కూతురుని హీరోయిన్ గా పరిచయం చేయడానికి డిజిటల్ మీడియాని వేదికగా ఆమె మార్చుకుంది.