పస్తులు ఉంటాం కానీ.. చైనా కంపెనీలలో పని చెయ్యం: జొమాటో ఫుడ్‌ డెలివరీ బాయ్స్

చైనా భారత్ మధ్య ఘర్షణలో భారతదేశానికి చెందిన 20 మంది సైనికులు అమరులవడంతో ఒక్కసారిగా భారత దేశ పౌరులందరు రగిలిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బాయ్కాట్ చైనా అనే నినాదం ఊపందుకుంది.

 We Do Not Work In A Zomato Company..delivery Boys Protest, Zomato Delivery Boys,-TeluguStop.com

ఎంతో మంది చైనా వస్తువులను కొనుగోలు చేయడం ఆపడంతో పాటు… చైనా యాప్స్ ని కూడా డిలీట్ చేస్తున్నారు.అయితే తాజాగా జొమాటో డెలివరీ బాయ్స్ వినూత్నంగా తమ దేశ భక్తిని చాటుకున్నారు.

జొమాటో కంపెనీ చైనాకు చెందిన పెట్టుబడులు ఉన్న కంపెనీ అన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ఈ కంపెనీ లో పని చేయమని… కావాలంటే పస్తులు ఉంటాం తప్ప.

చైనా కంపెనీలో మాత్రం పని చేయము అంటూ తేల్చి చెప్పారు డెలివరీ బాయ్స్.ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జరిగింది.ఈ క్రమంలోనే తమ జొమాటో టీ షర్టులను కాల్చివేసి వినూత్నంగా నిరసన తెలిపారు డెలివరీ బాయ్స్.

అంతేకాకుండా జొమాటో చైనా కు సంబంధించిన కంపెనీ అని దీని ద్వారా ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయొద్దని కోరారు.

చైనా కంపెనీలు భారతదేశంపై ఆదాయం పొందుతూనే… మళ్లీ భారత్ పైన దాడికి దిగుతున్నారు అంటూ ఆరోపించారు.అందుకే చైనా పెట్టుబడు లు ఉన్న ఏ కంపెనీలో పని చేయమని తేల్చి చెప్పారు డెలివరీ బాయ్స్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube