ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వ అధికారులు ప్రజలకి సూచిస్తున్నారు.
అంతేగాక ఈ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో పలు సంస్థలు తాత్కాలికంగా మూసివేశారు.అయితే ఇలా తాత్కాలికంగా మూసివేసిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి.
దీంతో ప్రస్తుతం పలువురు సినీ ఆర్టిస్టులు ఆదాయం లేక, కుటుంబం గడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజాగా కేరళకు చెందినటువంటి ఓ సీరియల్ నటి అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని ఏకంగా నాటు సారాయి తయారు చేసే బట్టీని నిర్మించి అక్రమంగా నాటు సారాయిని తయారు చేయడం, విక్రయించడం వంటివి చేస్తోంది.
దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సారాయి బట్టీలపై నిర్వహించి కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.అయితే ఇందులో ఓ సీరియల్ నటి కూడా ఉంది. దీంతో ఒక్కసారిగా కేరళ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.అయితే ఈ సీరియల్ నటి గతంలో కూడా అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం పలు ఘాతుకాలు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు.
దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సీరియల్ నటిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమకు చెందినటువంటి అన్ని పనులు నిలిపి వేశారు.
దీంతో కొంత మంది ఆర్టిస్టులు ఇలా ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని కొందరు వాపోతున్నారు.అంతేగాక తమ కుటుంబాల గడవడానికి కొంతమేర ప్రభుత్వం సహాయం చేయాలని కూడాకోరుతున్నారు.